Tuesday, October 22, 2013

'ఏనెబాయి' ఓ రసాయన రహిత గ్రామం ..

వరంగల్:
వరంగల్ జిల్లా  ఏనెబాయి గ్రామం :
గ్రామీణ స్వావలంభన గురించి ఏ సదస్సులో చర్చకొచ్చినా ఆ ఊరి పేరే చెబుతారు. రసాయన రహిత సేద్యం గురించి ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా ఆ పల్లెనే ఉదాహరణగా చెబుతారు. ఇక్కడి రైతుల ఆలోచనలు, నిర్ణయాలు, శ్రమజీవనం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వ్యవసాయ శాస్ర్తవేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆ పల్లెబాట పడుతున్నారు.అదే వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని మారుమూలపల్లె ఏనెబాయి.తిప్పికొడితే 52 కుటుంబాలు నివాసముంటున్నాయి ఈ గ్రామంలో. స్థానిక భూస్వాములపై పోరాడిన చిన్నరైతులు పక్క ఊళ్లోకి వలస వెళ్లారు. సొంత ఊళ్లో భూమిని అమ్మేసుకొని ఇక్కడ 132 ఎకరాల బంజరుభూమిని కొనుక్కున్నారు. ఊళ్లో చిన్న గుట్ట, దాని పక్కనే బావి ఉన్నందున ఈపల్లెకు ఏనెబాయి అని పేరు పెట్టుకున్నారు. అలా పుట్టింది ఈ ఊరు.

ఎర్రలతో సేంద్రియ ఎరువులు..

1975 నుంచి 1995 వరకు ఏనబావి రైతులు వ్యవసాయం చేశారనడం కన్నా విధ్వంసం చేశారని చెప్పొచ్చు. రసాయన సేద్యానికి బానిసై భూసారాన్నంతా పీల్చిపిప్పిచేశారు. ఫలితంగా అప్పులు తప్ప నయా పైసా ఆదాయం రాలేదు.సరిగ్గా ఈ సమయంలోనే సెంటర్‌ రూరల్ ఆపరేషన్ ప్రోగ్రామ్స్‌ సొసైటీ క్రాప్స్ చీడ నివారణ ఉద్యమాన్ని ప్రారంభించింది. జీపపు ఎర్రలతో తల్లి పురుగులను ఎలా నాశనం చేయొచ్చు నేర్పించింది. దీన్ని అక్షరాల పాటించారు రైతులు. అంతే అక్కడి చీడ పురుగులు పరుగు పెట్టాయి. ఎరువులు, క్రిమిసంహారక మందులు గ్రామ దరిదాపుల్లోకి రాలేదు. సెర్ఫ్‌ సంస్థ ఎనబావిని రసాయన రహిత గ్రామంగా ప్రకటించింది.

రోజుకు 100 లీటర్ల పాల ఉత్పత్తి..

ఎనబావి రైతుల కృషిని స్వయంగా చూసిన ఆంధ్రాబ్యాంకు అధికారులు పశువులను కొనేందుకు రుణాలిచ్చారు. ఇంకేముంది గోదూళితో పల్లె పావనమైంది. ప్రస్తుతం ఈ గ్రామంలో 100 లీటర్ల పాలు ఉత్పత్తివుతున్నాయి. గోమూత్రం, శనగపిండితో చేసే జీవామ్రుతంతో భూమికి రోగనిరోధక శక్తిని పెంచుతున్నారు.ఇక్కడ ప్రతీ రైతు ఇంట్లో సన్నబియ్యం నిల్వలు ఉంటాయి. పప్పు ధాన్యాలు, కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు. ఎవరికి పండినా అందరూ పంచుకుంటారు. ఏనెబావిలో 26 బోర్లు, 11 బావులు ఉన్నాయి. గ్రామస్తులంతా కలిసి జలసంరక్షణా
సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అవసరానికి మించి బోర్లు వేయకూడదని తీర్మానించుకున్నారు. పంపుసెట్లకు కెపాసిటర్లు అమర్చుకున్నారు. అనధికారిక విద్యుత్‌ వాడకం ఇక్కడ నిషేదం. పండుగ రోజుల్లో తప్ప గ్రామస్తులు చాలావరకు మాంసాహారం జోలికి వెళ్లరు. గుడుంబా గుప్పుమనని గ్రామం ఇది. ఇంకేముంది..ఏనెబావి కీర్తి ఎల్లలు దాటింది. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుతున్న ఈ గ్రామస్తుల కృషికి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. ఇక్కడి వ్యవసాయ పద్దతులు తెలుసుకునేందుకు 30 వేల మంది వచ్చారు. ఇక్కడి మహిళలు విదేశాలకు వెళ్లి వ్యవసాయ పద్ధతులు నేర్పి వచ్చారు. అయితే పరాయి దేశంవాడు మన స్వశక్తిని ప్రశంసిస్తుంటే మన పాలకులు మాత్రం గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం.
వరంగల్: గ్రామీణ స్వావలంభన గురించి ఏ సదస్సులో చర్చకొచ్చినా ఆ ఊరి పేరే చెబుతారు. రసాయన రహిత సేద్యం గురించి ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా ఆ పల్లెనే ఉదాహరణగా చెబుతారు. ఇక్కడి రైతుల ఆలోచనలు, నిర్ణయాలు, శ్రమజీవనం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వ్యవసాయ శాస్ర్తవేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆ పల్లెబాట పడుతున్నారు.
అదే వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని మారుమూలపల్లె ఏనెబాయి. తిప్పికొడితే 52 కుటుంబాలు నివాసముంటున్నాయి ఈ గ్రామంలో. స్థానిక భూస్వాములపై పోరాడిన చిన్నరైతులు పక్క ఊళ్లోకి వలస వెళ్లారు. సొంత ఊళ్లో భూమిని అమ్మేసుకొని ఇక్కడ 132 ఎకరాల బంజరుభూమిని కొనుక్కున్నారు. ఊళ్లో చిన్న గుట్ట, దాని పక్కనే బావి ఉన్నందున ఈపల్లెకు ఏనెబాయి అని పేరు పెట్టుకున్నారు. అలా పుట్టింది ఈ ఊరు.
ఎర్రలతో సేంద్రియ ఎరువులు..
1975 నుంచి 1995 వరకు ఏనబావి రైతులు వ్యవసాయం చేశారనడం కన్నా విధ్వంసం చేశారని చెప్పొచ్చు. రసాయన సేద్యానికి బానిసై భూసారాన్నంతా పీల్చిపిప్పిచేశారు. ఫలితంగా అప్పులు తప్ప నయా పైసా ఆదాయం రాలేదు.సరిగ్గా ఈ సమయంలోనే సెంటర్‌ రూరల్ ఆపరేషన్ ప్రోగ్రామ్స్‌ సొసైటీ క్రాప్స్ చీడ నివారణ ఉద్యమాన్ని ప్రారంభించింది. జీపపు ఎర్రలతో తల్లి పురుగులను ఎలా నాశనం చేయొచ్చు నేర్పించింది. దీన్ని అక్షరాల పాటించారు రైతులు. అంతే అక్కడి చీడ పురుగులు పరుగు పెట్టాయి. ఎరువులు, క్రిమిసంహారక మందులు గ్రామ దరిదాపుల్లోకి రాలేదు. సెర్ఫ్‌ సంస్థ ఎనబావిని రసాయన రహిత గ్రామంగా ప్రకటించింది.
రోజుకు 100 లీటర్ల పాల ఉత్పత్తి..
ఎనబావి రైతుల కృషిని స్వయంగా చూసిన ఆంధ్రాబ్యాంకు అధికారులు పశువులను కొనేందుకు రుణాలిచ్చారు. ఇంకేముంది గోదూళితో పల్లె పావనమైంది. ప్రస్తుతం ఈ గ్రామంలో 100 లీటర్ల పాలు ఉత్పత్తివుతున్నాయి. గోమూత్రం, శనగపిండితో చేసే జీవామ్రుతంతో భూమికి రోగనిరోధక శక్తిని పెంచుతున్నారు.
ఇక్కడ ప్రతీ రైతు ఇంట్లో సన్నబియ్యం నిల్వలు ఉంటాయి. పప్పు ధాన్యాలు, కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు. ఎవరికి పండినా అందరూ పంచుకుంటారు. ఏనెబావిలో 26 బోర్లు, 11 బావులు ఉన్నాయి. గ్రామస్తులంతా కలిసి జలసంరక్షణా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అవసరానికి మించి బోర్లు వేయకూడదని తీర్మానించుకున్నారు. పంపుసెట్లకు కెపాసిటర్లు అమర్చుకున్నారు. అనధికారిక విద్యుత్‌ వాడకం ఇక్కడ నిషేదం. పండుగ రోజుల్లో తప్ప గ్రామస్తులు చాలావరకు మాంసాహారం జోలికి వెళ్లరు. గుడుంబా గుప్పుమనని గ్రామం ఇది. ఇంకేముంది.. ఏనెబావి కీర్తి ఎల్లలు దాటింది. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుతున్న ఈ గ్రామస్తుల కృషికి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. ఇక్కడి వ్యవసాయ పద్దతులు తెలుసుకునేందుకు 30 వేల మంది వచ్చారు. ఇక్కడి మహిళలు విదేశాలకు వెళ్లి వ్యవసాయ పద్ధతులు నేర్పి వచ్చారు. అయితే పరాయి దేశంవాడు మన స్వశక్తిని ప్రశంసిస్తుంటే మన పాలకులు మాత్రం గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. - See more at: http://www.10tv.in/news/Farming-Without-Chemicals-in-Eenabavi-Village-Warangal#sthash.qIXzWts4.dpuf

No comments: