Thursday, November 14, 2013

కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా..? కాస్త ఆలోచించండి!

కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా..? కాస్త ఆలోచించండి.. కూల్‌డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కూల్‌డ్రింక్ తాగడం వల్ల ఉత్సాహం వస్తుందని, శక్తి వస్తుందని ప్రకటనలు వస్తున్నా.. కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల కిడ్నీలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కూల్‌డ్రింక్స్‌లో ఉండే చక్కెరతో మూత్రపిండాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని జపాన్‌కు చెందిన ఒసాకా విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో గుర్తించారు. ఇందులోని చక్కెర మూత్ర పిండాల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు వీరి అధ్యయనంలో తేలింది. రోజుకు కనీసం రెండు కూల్‌డ్రింక్స్‌ తీసుకునే వారిలో ప్రొటీనూరియా లేక మూత్రంలో ప్రోటీన్ల విసర్జన ఎక్కువగా జరుగుతున్నట్టు వీరు తమ అధ్యయనంలో గుర్తించారు. కాబట్టి కూల్‌డ్రింక్స్‌ తాగేటప్పుడు కాస్త ఆలోచించండి.

మధ్యాహ్న నిద్ర మంచిదేనంటున్న ఆరోగ్య నిపుణులు!

చాలా మందికి మధ్యాహ్నం పూట కాస్త కునుకుతీయటం అలవాటు. ఇంటి పట్టున ఉండేవారు మాత్రమే కాకుండా ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసే వారు కూడా తమతమ సీట్లలో పది నిమిషాల పాటు కునుకుతీస్తుంటారు. అలా 10 -20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్నట్టయితే, వారు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.

అయితే, కొన్ని కొలువుల్లో ఇలాంటి అవకాశం లభించనే లభించదు. ఇలాంటి వారి శరీరం అలసటకు గురవుతుందని చెపుతున్నారు. దీన్ని తట్టుకునేందుకు టీ తాగడం, చిరు తిండ్లు ఆరగించడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీర బరువు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

అందువల్ల ఆఫీసుల్లో పని చేసే సిబ్బంది కూడా పది నిమిషాల పాటు తమ కుర్చీల్లోనే నిద్రపోయినట్టయితే వారు తమ విధుల్లో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

శరీరంలో రక్తం ఉత్పత్తి కావాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి.

చూడటానికి బక్కపలచగా ఉన్నారా.. డాక్టర్ దగ్గరకు వెళితే శరీరంలో రక్తం లేదని చెప్పారా.. ఇక లాభం లేదని బ్లడ్ ఎక్కించుకోవాలనుకుంటున్నారా.. అయితే కాస్త ఆగండి. శరీరంలో రక్తం ఉత్పత్తి కావాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి.

శరీరంలో రక్తశాతం తగ్గితే అలసట, ఉదర సంబంధిత సమస్యలు, శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమవుతాయి. సో.. రక్త ఉత్పత్తికి, రక్త శుద్ధికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. నేరేడు పండ్లను అప్పుడప్పుడూ తింటూ ఉంటే రక్తం ఉత్పత్తి అవుతుంది.

ఖర్జూర పండ్లను తేనెలో మూడు రోజుల పాటు నానబెట్టి పూటకు రెండు లేదా మూడు స్పూన్లు తీసుకుంటే రక్తం ఉత్పత్తి అవుతుంది. ప్రతిరోజూ రాత్రి అర గ్లాసుడు నీటిలో ఎండిన అత్తిపండును నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పరగడుపున తాగితే రక్తం వృద్ధి చెందుతుంది.

ఇక బీట్‌రూట్, మునగాకును కందిపప్పుతో వండి.. అందులో కోడిగుడ్డును చేర్చి 41 రోజులు తింటూ వస్తే రక్తం ఉత్పత్తి అవుతుంది. అలాగే అల్లం రసంతో తేనె కలిపి తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. ఇంకా టమోటాను వంటలతో పాటు పచ్చిగా తినడం ద్వారా రక్తం శుద్ధీకరించబడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

బీహార్‌లో అతిపెద్ద విరాట రామాయణ మందిర నిర్మాణం!

బీహార్ రాష్ట్రంలో విరాట రామాయణ మందిరాన్ని నిర్మించనున్నారు. ఈ నమూనాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం ఆవిష్కరించారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం కానుంది

ప్రస్తుతం ప్రపంచంలోనే కంబోడియా దేశంలోని అంగ్‌కోర్‌వాట్ విష్ణుదేవాలయం అతిపెద్ద హిందూ దేవాలయంగా ఉంది. దీనికి మించిపోయేలా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ రూ.500 కోట్ల ఖర్చుతో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా విరాట రామాయణ మందిరాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు.

ద్వారకపీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి సమక్షంలో నితీశ్‌ కుమార్ ఈ ఆలయ నమూనాను ఆవిష్కరించారు. బీహార్ రాజధాని పాట్నాకు 120 కిలోమీటర్ల దూరాన పశ్చిమ చంపారన్ జిల్లాలోని జానకీనగర్‌లో 400 అడుగుల ఎత్తుతో అంగ్‌కోర్‌వాట్ కంటే రెండింతల విస్తీర్ణంలో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

దాదాపు 190 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఐదు అంతస్థుల మందిరంలో భగవాన్ శ్రీరాముడు ప్రధాన పూజలు అందుకుంటారు. రామలక్ష్మణులు నడయాడిన ఈ స్థలంలో, దేశవ్యాప్తంగా వచ్చే విరాళాల సహాయంతో ఆలయ నిర్మాణం జరుగుతుందని అధికారులు వెల్లడించారు.

ప్రతిష్టాత్మకమైన ఈ ఆలయ నిర్మాణం మహవీర్ మందిర్ ట్రస్ట్ పర్యవేక్షణలో వచ్చే ఐదేళ్లలో పూర్తికానుంది. ఈ మందిర సముదాయంలో శ్రీకృష్ణుడు, శివుడు, పార్వతి, విష్ణు, సూర్య, గణేశ్ తదితర హిందూ దేవతల విగ్రహాలను స్థాపించిన 18 ఆలయాలు ఉంటాయి.

ఈ ఆలయంలో ఏకకాలంలో 20 వేల మంది ఆసీనులు కావ్వొచ్చు. విరాట రామాయణ మందిరం గోపురం, శిల్పకళ అంగ్‌కోర్‌వాట్‌ను పోలిఉన్నా.. దాన్ని పూర్తిగా అనుకరించలేదని అధికారులు చెప్పారు.

Friday, November 8, 2013

Indian Space Mission, Poverty and Closet Racism

India has now successfully launched its mission to Mars. The mission was achieved at an extraordinary low price tag of $74 million - 1/10 of what a similar mission would cost NASA or ESA. If this successfully reaches Mars, India will be the first country to have the Mars mission succeed on the first try.

The Provocation

Just as quickly as the rocket sped off, the Western journalists who marveled the moon walk in their childhood are engaging the Indians in an unnecessary provocation. And these are not coming from cheap tabloids, but reputed media houses. It is not the criticism that rankles, but how crudely they are hitting below the belt.

This Guardian author chose to include poverty right in the headline:
India Mars Mission to Launch Amidst Overwhelming Poverty

What a refreshing headline!! Not even poverty. It has to be "overwhelming poverty". Who are we to launch into space? Should we not ask our British colonial masters before doing anything?

Apparently the other countries engaging in scientific research face no poverty. Apparently, space has something to do with poverty. Apparently, it is between funding ISRO and solving poverty. You cannot do both. No sir, no. Next time, when you write about something that Britain did well, sure to remember to randomly incorporate the poverty of Birmingham and the riots of London into the title.

"England wins 10 Olympic golds amidst all the poverty"
"NASA begins its moon mission despite failing to manage hurricane relief"
"European Space Agency launches a satellite despite the inability to control religious riots in Paris and Tottenham, London".

This CNN author didn't even pretend to hide the racist idea:
Is India's Mars mission the latest escalation in Asia's space race?
For a country like Australia, the space aspirations are extremely pragmatically driven. On the other hand, a country like Malaysia is intent on putting astronauts in space -- that's very prestige-oriented.

Apparently, brown people's ambitions to reach space is not pragmatic enough. Apparently, the $75 million spent on the Mars mission is the only thing that keeps us from building toilets.

This gentleman at Guardian makes a thinly-veiled threat:
ISRO to launch India's first spacecraft to Mars
Critics of Britain's aid programme in the country have also been angered by the mission. The UK gives India around £300m each year.

Britain threatens to pull its aid. This is ghastly. What would India do without all these do-gooder British aid? The Indian economy of 1 trillion pounds was badly depending on these 300 million pounds that comes with no strings attached.  We are an ungrateful bunch, aren't we? We are supposed to surrender our national priorities and research work and listen to our ex-colonial masters for a paltry 300 million.

This economist article is more subtle and even more racist:
How can poor countries afford space programmes?
What if the 16,000 scientists and engineers now working on space development were deployed instead to fix rotten sanitation?
Someone from Oxford wants to know why don't we all Indians work on toilets and potty research?

If this author lived at the time of Renaissance, s/he might have written:
Newton, Michelangelo and da Vinci are wasting time instead of building toilets.

Poverty should indeed be an excuse to postpone great achievements. Right?
These achievements are the ones that are keeping our kids smiling and hopeful. This kid has an extra inspiration now. She has extra hope.

The Double Standards

This is monumental for us Indians. Imagine how the Americans felt when they first landed on moon. This is a landmark work for Indian scientists and I am filled with pride, just as the 1960s Americans were filled with pride as Armstrong made his stride. Sure, America had plenty of issues in 1969 - Vietnam war, civil rights, inflation, unemployment. But, those negative news could wait another day. It was time to enjoy the moon.

Actually, these commentators give a squat about India. They don't have any history of commenting on India's social needs. This is just outright racism clothed in a patronizing tone. For me they just look sore losers and cry babies.

The Cost

Many of these journalists cribbing about the cost seem disconnected from India. We spent 450 crores on this mission. Let me put that in context. One of the local cricket teams - Mumbai Indians alone is worth 1000 crores. Ambani built a home in Mumbai for 5000 crores. Every single day, Indians buy gold jewelry worth 1500 crores. An upcoming Bollywood movie (made about space) is costing over 500 crores. And finally, Indian central government budget is 17 lakh crores (I actually rounded off this figure and that roundoff error alone could fund 130 such missions).

India doesn't have more toilets, not because we don't have extra 450 crores, but because of our poor execution of things. Don't heap your blame on poor ISRO for India's  social conditions (ironically, a non-trivial portion of this poverty & hunger is due to the colonization under a power from where you are writing these articles).

Why India needs a MARS program

  1. It is exciting for the children and teenagers, many of whom might take up a career in science, technology and research.  These kids deserve an inspiration in the sky. If we can get a couple of hundred of these kids into hard sciences, the mission would have paid for itself completely.
  2. ISRO is already using the technology to help other countries put their equipments in space (for a lucrative fee, of course). If we continue to innovate in cost and speed, we could become a big hub for space projects. That would mean employment for 1000s of engineers and lot of foreign $$. India successfully launches Indo-French, 6 foreign satellites
  3. India needs to prove its technological capabilities as it is building up the technology hub of the future - not just space, but everything. If you could launch a Mars mission at the cost of setting up ERP in an enterprise, you could build anything. There are both direct and intangible effects of this demonstration. This would really benefit India's tech companies. This is actually rocket science! Again more $$.
  4. India needs to spend on research to master the science of the future. NASA had plenty of spinoffs resulting out of its space program that advanced other fields such as medicine, apparel, food and navigation.
  5. We could have made the "Model T" of spacecrafts - inexpensive and quick. The mission was completed in just 14 months and $75 million with little prior expertise.  More importantly, the mission got off the ground on the first try. China, Japan and Russia have had to abort Mars missions in the past 2 decades due to launch failures. That is an outstanding engineering feat worth of salute.
  6. Indians have always been fascinated by space since antiquity. Our ancient scientists spent all their lives looking at space. In the recent times, scientists such as Subramaniam Chandrashekar (Nobel laureate in astrophysics), SN Bose (Boson was named after him) have electrified the field. This mission is deeply fascinating even from a cultural perspective.
  7. Imagine the potential it has for the humanity if we could launch 100s of inexpensive missions in our search for alternative life forms and alternative planets. 4 years ago India helped confirm that there is water on moon -  the confirmation of which has eluded global researchers for 5 decades. This mission sent to detect methane could be the start of a new life for Indian science. Aryabatta and Bhaskaracharya would be really proud of the lads who worked on this mission.
  8. We need our Renaissance. We can be drooling in our pee or we can start to create something. We have to start breaking the chain of poverty by thinking outside the box. That would mean boldly assertive. People in other walks of life can surely draw inspiration from our scientists. This day is so refreshing although I have zero connection with anything ISRO did.  If we can reach Mars, we can do anything - from politics, arts to science & sports.

Outsiders have no idea of what this all means to Indians. We launched a peace project - not a bomb. We didn't go around fighting a poor country citing the presence of fake WMD. We didn't build a vessel to conquer unsuspecting thirdworlders. We launched a mission to help humanity and the advancement of science. More importantly, we launched it with our money. We didn't ask for your money nor help. Who are you to patronize us this way?

These journalists are like the rich bullies who enter a poor man's house and mock at the books kept by the poor man - "you poor man can't afford to eat rich food and you can afford to buy more books?"

Yes, these journalists pretty much appear to me like those bullies. In short, to all these journalists mentioned above here is my finger, shown with love.

Balaji Viswanathan

Thursday, November 7, 2013

కొంచం విలువలు, సాంప్రదాయాలని మన పిల్లలకి వారసత్వంగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మన భారత మాత వీరుల కోసం మరియు వీరమాతల కోసం వేచిచూస్తుంది..

రెండేళ్ళ పిల్లవాడికి కూల్ డ్రింక్ తాపుతున్న తల్లితండ్రులు, నాలుగేళ్ల పిల్ల వాడికి కెఎఫ్ సి లో చికెన్ తినిపిస్తున్న తల్లి తండ్రులు, ఏడు ఏళ్ళ పిల్లవాడు టాబ్లెట్ మీద గుద్దుకునే ఆటలు, తొమ్మిదేళ్ళ పిల్ల వాడు ఫెరారీ కారు నడపడం, పన్నెండు యేండ్ల పిల్లవాడు రోజు పేస్ బుక్ తో గడపడం, 15 ఏళ్ళకే కంప్యూటర్/మొబైల్ లో నీలి చిత్రాలు చూడటం. డబ్బు సంపాదించినంత మాత్రాన ఇవన్ని చెయ్యలా, వారిని అదుపులో పెట్టుకోలేమా, జీవితం అంటే కేవలం డబ్బెనా?

పిల్లలకు ఎలాంటి సమాజాన్ని మనం ముందు ముందు ఇవ్వబోతున్నాం, ఒబెసిటి, రోగాలు, అసూయ, ద్వేషం, హత్యలు, అత్యాచారాలు, మోసాలు, మరింత పెరగటానికి దోహదం చెయ్యటం లేదా? రోజు రోజు కి మనుషుల మధ్య అంతరం పెరిగిపోతుంది, ఇది పెరిగే కొద్ది అసహన, ద్వేషం పెరిగి సమతుల్య దెబ్బ తింటుంది. పిల్లల భవిష్యత్తు తీర్చి దిద్దటంలో తల్లి తండ్రులది 50% శాతం, గురువులది 40%శాతం, 10% శాతం సమాజానిది. ఏదో పెళ్లి చేసుకున్నాం పిల్లలు పుట్టారు పెంచుతున్నాం అని భావించకండి, పిల్లల పట్ల పాషన్ వుండాలి, మీ పిల్లల జీవితాలను మిరే నాశనం చెయ్యకండి. ప్రతి దానికి కొన్ని హద్దులు వున్నాయి, వాటిని దాటకుండా పెంచే ప్రయత్నం చేద్దాం..

కొంచం విలువలు, సాంప్రదాయాలని మన పిల్లలకి వారసత్వంగ ఇద్దాం. మన పిలల్లని మరో భగత్ సింగ్, వివేకానంద, అబ్దుల్ కలాం లా తీర్చిదిద్దుదాం..
చదువు చదువు అని రేపటి మన పౌరులని పిచ్చివాళ్ళుగా చేయకండి..
మీ పిల్లలని స్వార్థ పరులుగా, అవినీతి పరులుగా, లంచగొండులుగా, మూర్ఖులుగా , చెడు వ్యసన పరులుగా, కాకుండ దేశభక్తులుగా, సేవతత్పరులుగా, ఆరొగ్యవంతమైన రేపటి భావి భారత పౌరులుగా పెంచండి..
ప్రస్తుత సమయం లో మన దేశానికి పవిత్రత తో ధీరులైన, ఆరొగ్యవంతులైన సంతానం అవసరం..
మన భారత మాత వీరుల కోసం మరియు వీరమాతల కోసం వేచిచూస్తుంది..

చివరిగా.. మన పిలల్లని కేవలం మన కోసం కాకుండ సమాజం కోసం, దేశం కోసం మంచి పౌరులుగా పెంచుదాం...

నిజమైన భారతీయ తల్లితండ్రులుగా మీ పిల్లలని పెంచి భరత మాత కీర్తిని పెంచే పౌరులని అందిస్తారని, మీ పిలల్లని భారత రత్నాలుగా తయారు చేస్తారని ఆశిస్తూ..

"భారత్ మాత కి జై" .. "నవ యువ భారత్ సదా జై"...

**జై హింద్**