Friday, June 14, 2013

పుట్టపర్తి - సత్య సాయి బాబా నివాసం

 

పుట్టపర్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో అనంతపురం అనే జిల్లాలో ఉన్న చిన్న పట్టణం. ఆధ్యాత్మిక గురువు సత్య సాయి బాబా యొక్క పవిత్ర నివాసం ఇక్కడ ఉండటం వల్ల ఒక ప్రసిద్ధ యాత్రా కేంద్రంగా మారింది. పట్టణం చిత్రావతి నది ఒడ్డున ఉంది.మరియు సముద్ర మట్టానికి 475 మీటర్ల ఎత్తులో ఉంది. పుట్టపర్తి యొక్క చరిత్ర శ్రీ సత్య సాయి బాబా యొక్క పుట్టుక మరియు జీవితం చుట్టూ తిరుగుతుంది. గతంలో పుట్టపర్తిని గొల్లపల్లి అని పిలిచే ఒక చిన్న వ్యవసాయ గ్రామం మరియు అక్కడ ఇళ్ళల్లో ఆవులను పెంచేవారు. సత్య సాయీ గా పిలువబడే సత్యనారాయణ రాజు నవంబర్ 23 1926 వ సంవత్సంలో శ్రీ పెద్ద వెంకప్ప మరియు శ్రీమతి ఈశ్వరమ్మ దంపతుల ఇంట జన్మించారు. తన అద్భుతమైన శక్తులు వలన ప్రజలు అతనిని షిర్డీ యొక్క సాయి బాబా అవతారముగా భావించేవారు. మరియు అతనిని సత్య సాయి బాబా అని పిలిచేవారు. అనేక సంఘటనలు కారణంగా ప్రజలు అతనిని అనుసరించడం ప్రారంభించారు, మరియు అతను ఒక ఆధ్యాత్మిక నాయకుడు అనే నమ్మకం వారికి కలిగింది. అతని బోధనలు ప్రపంచవ్యాప్తంగా జయ జయ ధ్వానాలు అందుకున్నాయి. ఆయన బోధనలు శాంతి, సత్యం, ప్రేమ, నిజాయితీ మరియు అహింస సూత్రాల పై ఆధారపడి ఉంటాయి. ఈ చిన్న గ్రామం ప్రపంచ స్థాయి పట్టణంగా మారింది.


పుట్టపర్తి ఫోటోలు, సత్య సాయి బాబా
Image source: aptdc.in


1950 లో, ప్రశాంతి నిలయం స్థాపించబడింది, మరియు ఈ ఆశ్రమం ఏర్పాటు చేయటం వలన ఈ గ్రామం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. అక్కడ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ వంటి సౌకర్యాలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు విద్యా సంస్థలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

దగ్గరలో ఉన్న అట్రాక్షన్స్

సత్య సాయి బాబా యొక్క తాత, లేట్ కొండమ రాజుచే ఆ గ్రామంలో మసీదు, హనుమాన్ ఆలయం, మరియు సత్యభామ ఆలయం నిర్మించబడ్డాయి. మరో సత్యభామ ఆలయంను ఇటీవల సత్య సాయి బాబా యొక్క అన్నయ్య శేషమా రాజు, బెంగుళూర్ వెళ్లే మార్గంలో నిర్మించారు. సత్య సాయి బాబా జన్మించిన ప్రదేశంలో శివాలయం నిర్మించబడింది. చిత్రావతి నది ఒడ్డున ఉన్న వృక్షం మరియు విశ్వవిద్యాలయం వైపు ఉన్న కొండ మీద ఉన్న ధ్యానం చెట్టు కూడా ప్రాముఖ్యత పొందింది. ఇటీవల కాలంలో విద్య మరియు సాంస్కృతిక సంస్థలను ముఖ్యమైన ప్రదేశాలలో నిర్మించి ఉద్యోగాలు ఇవ్వటం మరియు చిన్న పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలు యాత్రా స్థలములుగా మారినాయి.

కనెక్టివిటీ మరియు వాతావరణం

పుట్టపర్తి పట్టణం, కేవలం 4 కి.మీ.ల దూరంలో, ఆశ్రమం నుంచి శ్రీ సత్య సాయి విమానాశ్రయం అనే దేశీయ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం చెన్నై మరియు ముంబై వంటి ప్రధాన నగరాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. బెంగుళూర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం పుట్టపర్తి నుంచి 250 కి.మీ. దూరంలో ఉంది. పుట్టపర్తి ని సందర్శించడానికి సంవత్సరంలో ఉత్తమ సమయం సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. మార్చి నుంచి జూన్ వరకు వేసవి చాలా వేడిగా మరియు అసౌకర్యంగా ఉంటుంది.ఇక్కడ అంతర్గత శాంతి కొరకు ప్రయత్నిస్తారు మరియు ఆధ్యాత్మికత మరియు మతంతో సంబంధాన్ని కావాలనుకునే ప్రజలకు ఇదే ఒక పరిపూర్ణ మైన గమ్యం.

హోగెనక్కల్ - స్మోకీ రాక్ జలపాతం

హోగేనక్కల్, ఇది కావేరి నది ప్రక్కన ఉన్న ఒక చిన్న మరియు బిజీగా వుండే గ్రామము. దీనికి ఈ పేరు రెండు కన్నడ పదాలనుండి వొచ్చింది. 'హోగె' అంటే 'పొగ' అని అర్థం మరియు 'కాల్' అంటే 'రాళ్ళు' అని అర్థం. ఈ విషయంలో పొగ ఒక ప్రముఖ జలపాతం, హోగేనక్కల్ జలపాతాలు, నుండి వొస్తుంది. నీరు పై నుంచి క్రిందికి శరవేగంతో పడుతున్నప్పుడు క్రింద భూమి పైన పొగగా మార్పు చెందుతున్నది. నదివైపు ఉన్న గ్రామం మెట్రోపాలిటన్ నగరం, బెంగళూరుకి సుమారు 150 కి. మీ. దూరంలో ఉన్నది. మరియు ఇది తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల బోర్డర్స్ మీద ఉన్నది. ఇది దేశీయ మరియు విదేశీ పర్యాటకులకు ప్రసిద్ధ వారాంతపు పర్యాటక ప్రదేశంగా ఉన్నది. కావేరి నది యొక్క గలగలలు, నదిలో పట్టుకున్న చేపలు, స్థానిక మూలికలు, ప్రత్యేక నూనెలు మరియు మర్దన పింట్లు యొక్క పురాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి మర్దనలు, ఇవి అన్నీ హోగేనక్కల్ సందర్శించి అనుభవించవలసిందే! ఎవరైతే సాహసాలను ఇష్టపడతారో, ఈ జలపాతాలలో ఈత కొట్ట వలసిందే! కాని ఇందులో ఈత కొట్టటం అంత సులభమైన పని కాదు. ఒక్క ఈత నిపుణులకు మాత్రమె సాధ్యపడుతుంది. లేదా మేలగిరి హిల్స్ గుండా ట్రెక్కింగ్ చేస్తూ, స్వచ్చమైన అడవి గాలిని ఆస్వాదిస్తూ, ఈ ప్రదేశంలో ఉన్న అద్భుతమైన ఆకుపచ్చని ప్రక్రుతి దృశ్యాలను మరియు అందాలను చూడవొచ్చు. సినిమాలు తీసేవాళ్ళు 'హోగేనక్కల్' ను రొమాంటిక్ పాటలు తీయటానికి ఎన్నుకుంటారు.


హోగేనక్కల్ ఫోటోలు, హోగేనక్కల్ జలపాతాలు
Image source: www.wikipedia.org
ఆకర్షణలు - ప్రకృతి ఒడిలో హోగేనక్కల్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి కావేరి నదిలో కోరాకిల్ పడవ రైడ్. కోరాకిల్స్, ఇవి గుండ్రంగా ఉన్న ప్రత్యేకమైన బాస్కెట్ పడవలు. వీటి అడుగుభాగం ప్లాస్టిక్ షీట్స్ తో, నీరు అడుగున చేరకుండా ఉండటానికి కప్పబడి ఉంటాయి. బోటుమాన్ తో ఒప్పందం కుదుర్చుకొండి, మరియు కావేరి నదిలో ఒక రైడ్ ఆస్వాదించండి. చూడటానికి చిన్నగా కనిపించినా, ఒక పడవలో 8 మంది పడతారు. ఇక్కడ ఆహారంతో పాటు, స్థానిక మాస్సేర్స్, వీరినే మాలిష్-కరన్స్ అని కూడా అంటారు, తో 'స్పా' చికిత్స ఇంకొక గొప్ప ఆకర్షణ. ఇక్కడి పిల్లలు నదిలోకి 30 అడుగుల ఎత్తునుండి దూకి వారియొక్క గొప్పతనాన్ని చాటుకుంటారు. పిల్లలు ఇక్కడ ఒక్క డైవ్ కి రూ.5/- తీసుకుంటుంటారు. ఈ ప్రదేశంలో మంచి అనుసంధానం మరియు మంచి వాతావరణం సంవత్సరమంతా ఉంటుంది.

What Indian advertisements taught me.??? ( NOW A DAYS )


1. Kareena has dandruff problem, Katrina has dry hair problem, Shilpa has hairfall problem and Priyanka has chip-chip.???

2. If you've a hot wife, make sure your neighbor doesn't use a deodorant in your absence.??????

3. Your complexion is more important than your qualifications.??

4. If there is no salt in your kitchen you can use Toothpaste.

5. Every second oral care brand is No. 1 and recommended by every dentist in India!!!

6. If your daughter is not Ready to Get married, take her to a jewelry/textile shop.

7. Only reason why men use deodorant is to get girls.?????

8. Most colas cure all kinds of phobias. You will be close to a superman, if you drink these regularly!!

9. All superstars are so poor that they prefer to risk life for a cool drink than to purchase it for Rs:10

10. The special effects in shampoo ads are greater than special effects in Avatar.

11. Fruit content in shampoo and soap is more than fruit content in 99% of juices.

12. Amul has better satirical cartoonists than people who make better milk products.

13. Most people buy vehicles to travel in bad roads but complain about roads in India.

14. You can't eat Dairy Milk Silk without spreading it all over you face.

15. Nobody uses motorbikes for commuting, its only to pick up girls ! ?

16. All soaps kill 99.9% of germs.

17. People believe that Bacardi makes music CD's and Directors special/Kingfisher make mineral
      water.?

18. The only time mothers and daughters talk to each other, it's usually about hair oil.??

19. No matter what kind of expert one is, he'll always wear a white laboratory coat.?

hahhahahahahahhhahhahahha just for fun..........................

Thursday, June 13, 2013

రూపాయి పతనం.. సామాన్య మానవునిపై భారం ఎలా..?


1.  పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల


భారత్ దిగుమతుల బిల్లు ప్రతి సంవత్సరం 450 బిలియన్ డాలర్ల పైమాటే. రూపాయి క్షీణంచడం వల్ల ఈ బిల్లూ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే.. పెట్రోల్ రేటు లీటరుకు రూ. 2 మేర పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో పెరిగే అవకాశముందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.

 

2. కీలకమైన ఉత్పత్తులు, ఎరువులు మరింత భారం

 

కీలకమైన ఉత్పత్తులు, ముడి సరుకులు కోసం భారత్ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ముడి చమురు, బంగారం, ఎరువులు మొదలైన వాటన్నింటినీ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇందులో అత్యధిక వాటా ముడిచమురుదే. ఫలితంగా వంట నూనెల నుంచి పెట్రోల్ దాకా అన్నీ భారం అవుతాయి.

 

3. విదేశీ రుణాలు మరింత భారం

 


రూపాయి పతనంతో అత్యధికంగా విద్యుత్, సిమెంట్, టెలికం రంగ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడనుంది. కొనాళ్ల క్రితం విదేశీ రుణాలు చాలా చౌకగా దొరుకుతుండటంతో చాలా దేశీ కంపెనీలు చక చకా అప్పులు తెచ్చుకున్నాయి. ఇప్పుడు రూపాయి క్షీణంచండం వల్ల కట్టాల్సిన వడ్డీ పెరగడమే కాకుండా అసలు మొత్తం కూడా పెరిగిపోయింధి.

 

4. రూపాయి పతనం.. బంగారం ఎఫెక్ట్

 

 
అంతర్జాతీయంగా పసిడి తగ్గుతున్నా.. రూపాయి పతనం వల్ల దేశీయంగా ఆ స్థాయిలో తగ్గడం లేదు. గడిచిన పక్షం రోజుల్లో అంతర్జాతీయంగా బంగారం ధరలు 2.94 శాతం దాకా పడగా.. దేశీయంగా మాత్రం 3.14 శాతం పెరిగాయి.

 

5. రూపాయి పతనం.. ధరలు పెరిగే వస్తువులు

 

 రూపాయి పతనంలో ధరలు పెరిగే వస్తువుల జాబితాలో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్‌తోపాటు రంగులు(పెయింట్స్), వాహనాలు, పురుగు మందులు, కాఫీ, చాకొలేట్లు, ప్లాటినం, బొగ్గు, ఐరన్, సోలార్ సెల్స్, సోలార్ ఉత్పత్తులు, ఎల్‌ఈడీ లైట్లు, స్టెంట్లు, ఇతర వైద్య పరికరాలు, బొమ్మలు, టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి.


తీర్థ మలై, ధర్మపురి

తీర్ధమలై నీటి బుగ్గల మహత్యం.. పాపాలే కాదు, వ్యాధులూ పోతాయ్ !

 

తమిళ్ నాడు లోని ధర్మపురి జిల్లా లో కల తీర్థ మలై ప్రసిద్ధ యాత్రా స్థలం. ఇక్కడకు పిక్నిక్ గా చాలా మంది వస్తారు. ఇక్కడ అయిదు నీటి బుగ్గలు కలవు. ఇవి ఒక ఏటవాలు కొండ నుండి ఊరు తాయి. టెంపుల్ పేరు ఒక నీటి బుగ్గనుండి పెట్టారు. ఈ టెంపుల్ లో శివుడిని పూజిస్తారు. శివుడిని ఇక్కడ తీర్థ గిరిశ్వర అంటారు. ఈ నీటి బుగ్గల నీటిలో స్నానాలు చేసిన వారికి పాపాలు పోతాయని స్థానికులు చెపుతారు.

 ధర్మపురి - దేవాలయాలు మరియు చర్చిల నగరం

ఇండియా లోని తమిళ్ నాడు రాష్ట్రంలో ధర్మపురి పట్టణం కలదు. ఈ ప్రదేశం పొరుగునే కల కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరుకు సమీపంగా వుంటుంది. ధర్మపురి దాని సహజ అందాలకు ప్రసిద్ధి చెందినది. అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. బెంగుళూరు మరియు చెన్నైల నుండి పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ ప్రాదేశానికి వస్తారు. ప్రాచీన కాలంలో ధర్మపురి చొళులు, రాష్ట్రకూటులు, పాండ్యులు చే ఈ ప్రదేశం పరిపాలించబడింది.

ధర్మ పురి ఫోటోలు, మేట్టుర్ డాం మరియు గార్డెన్
                                     Image source: commons.wikimedia.org
జలపాతాలు మరియు నీటి సరస్సుల భూమి ధర్మపురి మరియు చుట్టపట్ల కల ఆకర్షణలు

పేరు గాంచిన హోగేనక్కల్ ఫాల్స్ తమిళ్ నాడు మరియు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో కలవు. ఈ ప్రదేశం ధర్మపురి కి 46 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఈ ప్రదేశం పర్యాటకులు విశ్రమించి ప్రశాంత, నీటి పరిసరాలను ఆనందించేందుకు అనుకూలంగా వుంటుంది. మరొక అందమైన ప్రదేశం క్రిష్ణగిరి డాం. ఇది కృష్ణగిరి మరియు ధర్మపురిల మధ్య కలదు. కొట్టాయి కోవిల్, చెన్నరాయ పేరుమల్ టెంపుల్ మరియుతీర్థ మలైలో కల శ్రీ తీర్థ గిరిస్వరార్ టెంపుల్ వంటివి ఇక్కడి ఆకర్షణలు. ఇంకనూ ఇక్కడ మౌంట్ కార్మెల్ చర్చి, సి.ఎస్.ఐ జిఒన్ చర్చి, సచ్రెద్ హార్ట్ కేథడ్రాల్ మరియు మెట్టూర్ డాం లు మరికొన్ని ఆకర్షణలు. అధియామన్ కొట్టాయి ప్రదేశం ధర్మపురి నుండి 7 కి.మీ. ల దూరంలో కలదు.
ఇక్కడ ఒక కోట శిధిల అవశేషాలు వుంటాయి. ఈ కోట కోడి గుడ్డు ఆకారంలో వుంటుంది.

తీర్థ మలై, ధర్మపురి



ధర్మపురి ఫోటోలు, తీర్తమలై, తీర్తమలై టెంపుల్
Image source:dharmapuri.nic.in
హిందూ పురాణాల మేరకు, శ్రీరాముడు వేలాది రాక్షలను రావణుడి తో చేసిన యుద్ధంలో వధించిన తర్వాత శివుడిని తన పాపాలు పోగొట్టుకునేందుకుగాను అర్చించాడు.

ధర్మపురి ఎలా చేరాలి??

ఈ ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక బస్సులను నడుపుతోంది. ధర్మపురికి తమిళ్ నాడులోని వివిధ ప్రదేశాలతో రోడ్డు మరియు రైల్ మార్గాలు కలవు. డీలక్స్, సెమి డీలక్స్, ఏ.సి మరియు నాన్ ఏ సి బస్సులు ధర్మపురి నుండి సమీప ప్రధాన నగరాలకు కలవు. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ ధర్మపురికి సమీపంగా వుంటుంది. ఈ ఎయిర్ పోర్ట్ లో దేశీయ మరియు విదేశీ విమానాలు నడుస్తాయి.
ధర్మపూరి సందర్శనకు ఉత్తమ సమయం వింటర్ నెలలు ఈ ప్రదేశ సందర్శనకు అనుకూల సమయం.

ప్రజారాలా.. దయచేసి బంగారానికి దూరంగా ఉండండి: చిదంబరం

Chidambaram Indians Please Do Not Buy Gold
 న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి ఒక్కసారిగా పతనమవ్వడంతో బోగ్గు ధరలు, గ్యాస్ ధరలు, కరెంట్ ధరలు పెరుగుతుండటంతో జూన్ నెలఖారులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై రివ్యూ మీటింగ్‌కి ప్లాన్ చేసినట్లు కేంద్ర ఆర్దిక మంత్రి పి. చిదంబరం తెలిపారు. వీటితో పాటు గత సెప్టెంబర్ రూపాయి మారకపు విలువని గమనించినట్లైతే ఎన్నోఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బంగారం మదుపు మరియు విక్రయాలపై మేము చేస్తున్న విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకోని దేశ ప్రజలు బంగారం కోనుగోలు తగ్గించుకోవాలని సూచించారు. ఒక వైపు కరెంట్ లోటు పెరిగి.. దేశ ఆర్ధిక వ్యవస్దకు పెనుభారం అవుతుండటంతో బంగారం దిగుమతులను కూడా ఆర్‌బీఐ తగ్గించిన విషయాన్ని ప్రస్తావించారు. మనదేశంలో 30 గ్రాముల బంగారు కూడా ఉత్పత్తి కావడం లేదని, సాధ్యమైనంత వరకూ ప్రజలు బంగారానికి దూరుంగా ఉండాలని పి. చిదంబరం మరోసారి ప్రజలకు తెలిపారు. మే మొదటి వారంలో బంగారం దిగుమతులు $135 మిలియన్ నుండి మే చివరి వారం వచ్చేసరికి $36 మిలియన్లకు తగ్గాయని అన్నారు. రూపాయి పతనం కావడంతో క్రూడ్ ఆయిల్, సహాయ వాయువులు, ఎరువులు ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారాయన్నారు. మనం దిగుమతి చేసుకునే వాటి రేట్లు అంతర్జాతీయ మార్కెట్లో అదే స్దాయిలో ఉన్నప్పటికీ.. రూపాయి పతనం కావడంతో ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మే ప్రారంభం నుండి ఇప్పటిదాకా 8.5 శాతం పైనే క్షీణించింది. మేలో 53 స్థాయిలో ఉంటే ప్రస్తుతం 58.39 వద్ద ఉంది. అంటే నెల రోజుల వ్యవధిలో సుమారు 500 పైసల పైగా పతనమైంది. రూపాయి పతనంతో అత్యధికంగా విద్యుత్, సిమెంట్, టెలికం రంగ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడనుంది. కొనాళ్ల క్రితం విదేశీ రుణాలు చాలా చౌకగా దొరుకుతుండటంతో చాలా దేశీ కంపెనీలు చక చకా అప్పులు తెచ్చుకున్నాయి. ఇప్పుడు రూపాయి క్షీణంచండం వల్ల కట్టాల్సిన వడ్డీ పెరగడమే కాకుండా అసలు మొత్తం కూడా పెరిగిపోయింది
తెలుగు వన్ఇండియా..

సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

  1.ముందుగా మీ సీడి పై భాగాన్ని సుబ్బు నీళ్లతో శుభ్రంగా కడిగేయండి. 


2. తరువాత సున్నితమైన క్లాత్ పై సీడీని ఉంచండి



 3.తరువాత మీరు వాడే పేస్టును కొంత తీసుకునీ సీడీ పై పాలిష్ చేయండి,


 4.పాలిషింగ్ పూర్తి అయిన అనంతరం ఓ అయిదు నిమిషాలు పాటు సీడీని అలానే ఉంచండి.


 5.ఇప్పుడు చల్లటి నీటితో మీ సీడిని శుభ్రం చేయండి.


 6.అనంతరం మెత్తని పేపర్ టవల్‌తో సీడీని శుభ్రంగా తుడుచుకోవాలి.  
 

 7.ఇప్పుడు చూడండి మీ సీడీ కొత్తదానిలో ఏలా మెరిసిపోతుందో!


Wednesday, June 12, 2013

లంచం పై పోరాటo.....





1. సమాజంలో ఏ మాత్రం మనకి నచ్చని పద్దతులుక నిపించినా వ్యవస్థ అంత కుళ్ళిపోయింది, అంటూ పక్కనుంచి తప్పుకుని వెళ్ళిపోతాం. అయితే - మార్పు సాధ్యమేనని నమ్మేవారు కొంతమంది  వుంటారు. అందుకు ప్రయత్నిస్తారు . మిగతా వారిని ఆలోచించమంటారు , ఇటువంటి వ్యక్తులు ఈ కాలంలో తక్కువగా కనిపించినా అరుదైతే కాదు -  అందులో ఒకరు విజయ్  -అమెరికాలో  మంచి ఉద్యోగం,ఆస్తి సంపాదన అన్నిటిని వదిలి ఓ సంకల్పంతో మాతృభూమిపై అడుగు పెట్ట్టాడు. అతను అనుకున్నది సాధించేందుకు  ప్రయత్నాలు మొదుపెట్టి నెమ్మది నెమ్మదిగా ప్రజల్లో అవగాహనా కల్పించేందుకు ప్రయత్నించి ఈ రోజున ఓ గొప్ప మార్పుకి మూలమైయ్యడు.. ఒక్కరుగా ఎంత సాధించవచ్చో నిరూపించాడు

2. లంచం అన్ని స్థాయిల్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. దాని ఇనుప పాదాల కింద  నలిగి ఎందరో విలవిల్లాడుతున్నారు.. ఎన్ని చట్టాలు వున్నా చేయి చాపే వారు చాపుతూనే వున్నారు , ఇదిగో ఈ లంచం పైనే గురిపెట్టాడు విజయ్ -  ఎక్కడో అమెరికాలో వున్న తనని అక్కడ స్నేహితుల మాటలు, హేళనలు, లంచం పై పోరాటానికి సిద్దపడేలా చేసాయి. అవినీతికి వ్యతిరేకంగా ప్రజా చైతన్యమే  పరిష్కారమనుకుని   'ఫిఫ్త్ పిల్లర్" అనే సంస్థ ను తమిళనాడులో ప్రారంభించాడు . శాసనం ,చట్టం, న్యాయం, మీడియా సమాజానికి  నాలుగు స్తంభాలయితే ప్రజల ఐదో స్తంభం అనే నినాదంతో ప్రారంభమయింది .ఈ "ఫిఫ్త్  పిల్లర్ "అవినీతిపై సందించిన అస్త్రం ఏంటో తెలుసా , ' జీరోనోట్ '.





౩.  ఈ " జీరోనోట్ "  ఇప్పుడు సమాజంలో  విప్లవాత్మక మార్పులకి  నాంది పలికింది. రూపాయి నోట్లలా వుండే ఓ జీరోనోట్ ని  సృష్టించాడు రూపాయి విలువ తో చూస్తే దానికి ఏ విలువా లేకపోయినా , లంచానికి మేం  వ్యతిరేకం అనితెలపడమే దాని ప్రధాన ఉద్దేశం. అంటే  మనల్ని  ఎవరైనా లంచం అడిగితే వారికి ఆ జీరోనోట్ ఇవ్వాలని, అంతేకాదు  దాంతో  మనం  లంచానికి వ్యతిరేకమని తెల్సిపోతుంది.. ఆ నోటుపై లంచం తీసుకోవడం ,అడగటం, ఇవ్వడం నేరమనే సందేశం వుంటుంది - దాంతో మనకి నిబంధనలు తెల్సునని ఎదుటి వ్యక్తికీ అర్ధమైపోతుంది, మరి  ఇలా " జీరోనోట్ "ని ఇచ్చినా లొంగని లంచావతరాలు  సంగతేంటి అంటారా ? దానికి ఓ మార్గం వుంది. 


4. జీరోనోట్ అంటేనే లంచానికి వ్యతిరేకం అని చెప్పటం, అయితే ఇలా "జీరోనోట్" ఇచ్చిన ఇంకా లంచం కోసం వెధిస్తే "ఫిఫ్త్ పిల్లర్ " కార్యకర్తలు అటువంటి వారిపై ఫిర్యాదులు చేస్తారు అవసరమైతే స్పింగ్ ఆపరేషన్లునిర్వహించి  వారి పని పడతారు . ఇలా "జీరోనోట్" ని ఉపయోగించి ఇప్పటి వరకు ఎందరో లంచం ఇవ్వకుండా పనులు చేయించుకోగలిగారు , అంతే కాదు దేశంలో ఏ  మూలా వున్నవారైన సరే  " ఫిఫ్త్ పిల్లర్" ల్ సభ్యులిగా చేరే అవకాశం, అలాగే ఫిఫ్త్ పిల్లర్ సహాయం పొందే అవకాశం కూడా వుంది ఇందుకోసం ఈ జీరోనోట్ పై అవగాహనా కల్పించేందుకు విజయ్  అతని బృందం విస్తృతంగా పర్యటిస్తున్నారు  కూడా.


5. ఇప్పటికే దాదాపు ఐదు లక్షల నోట్లు వాడబడ్డాయంటే అర్ధం చేసుకోండి ఎంత మంది  అవినీతికి ఈ జీరోనోట్ చెక్ పెట్టిందో - కేవలం లంచం ఇవ్వడం ఇష్టం లేనివారే కాదు తీసుకోవడం ఇష్టంలేని నిజాయితీపరులు కూడాఈ నోట్ ని తమ సీట్ దగ్గర అతికించుకుంటే చాలు, అతని దగ్గరికి వచ్చేవారికి అతను లంచానికి వ్యతిరేకి అని, ఫిఫ్త్ పిల్లర్ సభ్యుడని ఇట్టే అర్ధమైపోతుంది .దాంతో లంచం ఇవ్వటానికి సాహసించారు . ఇలా ఒక్కొక్కరుగా చేయి కలిపితే ఎంతటి మార్పు అయిన సాధ్యమే అని నిరూపించేందుకు  ప్రయత్నిస్తున్నారు. ఫిఫ్త్ పిల్లర్ సభ్యులు.
   www.5th pillar.org