Thursday, June 13, 2013

తీర్థ మలై, ధర్మపురి

తీర్ధమలై నీటి బుగ్గల మహత్యం.. పాపాలే కాదు, వ్యాధులూ పోతాయ్ !

 

తమిళ్ నాడు లోని ధర్మపురి జిల్లా లో కల తీర్థ మలై ప్రసిద్ధ యాత్రా స్థలం. ఇక్కడకు పిక్నిక్ గా చాలా మంది వస్తారు. ఇక్కడ అయిదు నీటి బుగ్గలు కలవు. ఇవి ఒక ఏటవాలు కొండ నుండి ఊరు తాయి. టెంపుల్ పేరు ఒక నీటి బుగ్గనుండి పెట్టారు. ఈ టెంపుల్ లో శివుడిని పూజిస్తారు. శివుడిని ఇక్కడ తీర్థ గిరిశ్వర అంటారు. ఈ నీటి బుగ్గల నీటిలో స్నానాలు చేసిన వారికి పాపాలు పోతాయని స్థానికులు చెపుతారు.

 ధర్మపురి - దేవాలయాలు మరియు చర్చిల నగరం

ఇండియా లోని తమిళ్ నాడు రాష్ట్రంలో ధర్మపురి పట్టణం కలదు. ఈ ప్రదేశం పొరుగునే కల కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరుకు సమీపంగా వుంటుంది. ధర్మపురి దాని సహజ అందాలకు ప్రసిద్ధి చెందినది. అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. బెంగుళూరు మరియు చెన్నైల నుండి పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ ప్రాదేశానికి వస్తారు. ప్రాచీన కాలంలో ధర్మపురి చొళులు, రాష్ట్రకూటులు, పాండ్యులు చే ఈ ప్రదేశం పరిపాలించబడింది.

ధర్మ పురి ఫోటోలు, మేట్టుర్ డాం మరియు గార్డెన్
                                     Image source: commons.wikimedia.org
జలపాతాలు మరియు నీటి సరస్సుల భూమి ధర్మపురి మరియు చుట్టపట్ల కల ఆకర్షణలు

పేరు గాంచిన హోగేనక్కల్ ఫాల్స్ తమిళ్ నాడు మరియు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో కలవు. ఈ ప్రదేశం ధర్మపురి కి 46 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఈ ప్రదేశం పర్యాటకులు విశ్రమించి ప్రశాంత, నీటి పరిసరాలను ఆనందించేందుకు అనుకూలంగా వుంటుంది. మరొక అందమైన ప్రదేశం క్రిష్ణగిరి డాం. ఇది కృష్ణగిరి మరియు ధర్మపురిల మధ్య కలదు. కొట్టాయి కోవిల్, చెన్నరాయ పేరుమల్ టెంపుల్ మరియుతీర్థ మలైలో కల శ్రీ తీర్థ గిరిస్వరార్ టెంపుల్ వంటివి ఇక్కడి ఆకర్షణలు. ఇంకనూ ఇక్కడ మౌంట్ కార్మెల్ చర్చి, సి.ఎస్.ఐ జిఒన్ చర్చి, సచ్రెద్ హార్ట్ కేథడ్రాల్ మరియు మెట్టూర్ డాం లు మరికొన్ని ఆకర్షణలు. అధియామన్ కొట్టాయి ప్రదేశం ధర్మపురి నుండి 7 కి.మీ. ల దూరంలో కలదు.
ఇక్కడ ఒక కోట శిధిల అవశేషాలు వుంటాయి. ఈ కోట కోడి గుడ్డు ఆకారంలో వుంటుంది.

తీర్థ మలై, ధర్మపురి



ధర్మపురి ఫోటోలు, తీర్తమలై, తీర్తమలై టెంపుల్
Image source:dharmapuri.nic.in
హిందూ పురాణాల మేరకు, శ్రీరాముడు వేలాది రాక్షలను రావణుడి తో చేసిన యుద్ధంలో వధించిన తర్వాత శివుడిని తన పాపాలు పోగొట్టుకునేందుకుగాను అర్చించాడు.

ధర్మపురి ఎలా చేరాలి??

ఈ ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక బస్సులను నడుపుతోంది. ధర్మపురికి తమిళ్ నాడులోని వివిధ ప్రదేశాలతో రోడ్డు మరియు రైల్ మార్గాలు కలవు. డీలక్స్, సెమి డీలక్స్, ఏ.సి మరియు నాన్ ఏ సి బస్సులు ధర్మపురి నుండి సమీప ప్రధాన నగరాలకు కలవు. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ ధర్మపురికి సమీపంగా వుంటుంది. ఈ ఎయిర్ పోర్ట్ లో దేశీయ మరియు విదేశీ విమానాలు నడుస్తాయి.
ధర్మపూరి సందర్శనకు ఉత్తమ సమయం వింటర్ నెలలు ఈ ప్రదేశ సందర్శనకు అనుకూల సమయం.

No comments: