Wednesday, June 26, 2013

తల వెంట్రుకలను వత్తుగా పెంచే తానికాయ

తానికాయ

తానికాయ : తానికాయలో కూడా కరక్కాయ, ఉసిరికాయలలో వలె లవణరసము తప్ప మిగిలిన అయిదు రసములు ఉండును. వేడి చేయు స్వభావము కలదు. కఫ, పిత్త, వాత దోషములను తగ్గించును. దగ్గు, నేత్ర రోగములు, కం రోగములందు పనిచేయును. తలవెంట్రుకలను వత్తుగా పెంచును. నులిపురుగులను నశింపచేయును. దగ్గు, వాంతులను తగ్గించును.  

దగ్గు, ఆయాసముల యందు తానికాయల చూర్ణమును తేనెతో ఇవ్వవలయును. తానికాయ గింజలలోని పప్పు మూత్రాశయములోని రాళ్ళను కరిగించును. అటులే తానికాయ పప్పును తేనెతో ఇచ్చిన సుఖ నిద్రను కలుగ చేయును. తానికాయ గింజలలోని పప్పును మెత్తగా నూరి పైన పూత పూసిన వాపులు తగ్గును. నేతితో వేయించిన తానికాయ పెచ్చును చప్పరించిన గొంతు బాధలు తగ్గి మంచి స్వరము కలుగును.

ఆయుర్వేదము నందు కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలకు మంచి ప్రాధాన్యత కలదు. ఈ మూడు కాయలను సమభాగాలుగా తీసుకొని గింజలు తీసివేయగా మిగిలిన దానిని ఎండబెట్టి చూర్ణముగా తయారుచేయుదురు. దీనిని త్రిఫల చూర్ణమందురు. ఇది అన్ని ఆయుర్వేద మందుల షాపులలోనూ లభించును. ఈ చూర్ణములో పై మూడు కాయలలోని అన్ని గుణములు ఉండును. 

ఈ త్రిఫల చూర్ణమును ఒక చెంచా చొప్పున ప్రతిరోజూ రెండు పూటలా సేవించినచో సుఖ విరేచనమగును. ముఖము కాంతివంతమగును. 

డా.పి.బి.ఏ.వేంకటాచార్య

No comments: