Thursday, November 14, 2013

శరీరంలో రక్తం ఉత్పత్తి కావాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి.

చూడటానికి బక్కపలచగా ఉన్నారా.. డాక్టర్ దగ్గరకు వెళితే శరీరంలో రక్తం లేదని చెప్పారా.. ఇక లాభం లేదని బ్లడ్ ఎక్కించుకోవాలనుకుంటున్నారా.. అయితే కాస్త ఆగండి. శరీరంలో రక్తం ఉత్పత్తి కావాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి.

శరీరంలో రక్తశాతం తగ్గితే అలసట, ఉదర సంబంధిత సమస్యలు, శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమవుతాయి. సో.. రక్త ఉత్పత్తికి, రక్త శుద్ధికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. నేరేడు పండ్లను అప్పుడప్పుడూ తింటూ ఉంటే రక్తం ఉత్పత్తి అవుతుంది.

ఖర్జూర పండ్లను తేనెలో మూడు రోజుల పాటు నానబెట్టి పూటకు రెండు లేదా మూడు స్పూన్లు తీసుకుంటే రక్తం ఉత్పత్తి అవుతుంది. ప్రతిరోజూ రాత్రి అర గ్లాసుడు నీటిలో ఎండిన అత్తిపండును నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పరగడుపున తాగితే రక్తం వృద్ధి చెందుతుంది.

ఇక బీట్‌రూట్, మునగాకును కందిపప్పుతో వండి.. అందులో కోడిగుడ్డును చేర్చి 41 రోజులు తింటూ వస్తే రక్తం ఉత్పత్తి అవుతుంది. అలాగే అల్లం రసంతో తేనె కలిపి తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. ఇంకా టమోటాను వంటలతో పాటు పచ్చిగా తినడం ద్వారా రక్తం శుద్ధీకరించబడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

No comments: