స్త్రీలు ప్రార్థన చేయుటకై సాష్టాంగ నమస్కారం చేయకూడదని చెప్పబడింది. సాష్టాంగ ప్రణామము చేయటానికి ఎనిమిది అంశాలు అవసరమౌతాయి. అవి చాతి (రొమ్ము), నుదురు, శబ్దం, మనస్సు,కాస్త ఎడంగా పెట్టి నమస్కార రూపంలో ఉంచిన చేతులు, కళ్ళు, మోకాళ్ళు మరియు పాదాలు.
సాష్టాంగ నమస్కారం చేయునప్పుడు రెండు పాదాల ముందుభాగం మోకాళ్ళు, చాతి మరియు నుదురు మాత్రమే నేలకు ఆనించి ఉంచాలి. అలా సాష్టాంగ పడ్డప్పుడు చేతులను తలభాగం పైకి ఎత్తి నమస్కరిస్తూ దేవతను ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి మంత్రాలను లేక శ్లోకాలను ఉచ్చరిస్తూ, దేవుడి విగ్రహంపై దృష్టిని ఉంచి మనస్సులో దేవుడిని ధ్యానించాలి.
ఈ పద్దతి వందనం స్త్రీల శరీర నిర్మాణానికి తగినది కాదు. పురుషులకే ఈ విధమైన నమస్కారాన్ని ఖచ్చితంగా చేయడం ఎంతో ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఆధునిక శాస్త్రం సైతం స్త్రీలు ఇలాటి ప్రణామాలు చేయడం ద్వారా వారి గర్భాశయం స్థానభ్రమంశం అయ్యే అవకాశం ఉందని తెలియజేయడం జరగింది. అందుకని స్త్రీలు మోకాళ్ళపై ఉంది నమస్కారించడమో, ధ్యానించడమో లేక మోకాళ్ళపై ఉంది మోకరిల్లడమో చేయాలి. మోకరిల్లడం వాళ్ళ ఎలాంటి హాని ఉండదు సరికదా వారికి మంచి వ్యాయామంలా పనిచేసి ఆరోగ్యాని చేకూర్చుతుంది.
No comments:
Post a Comment