పుట్టపర్తి - సత్య సాయి బాబా నివాసం
పుట్టపర్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో అనంతపురం అనే జిల్లాలో ఉన్న చిన్న పట్టణం. ఆధ్యాత్మిక గురువు సత్య సాయి బాబా యొక్క పవిత్ర నివాసం ఇక్కడ ఉండటం వల్ల ఒక ప్రసిద్ధ యాత్రా కేంద్రంగా మారింది. పట్టణం చిత్రావతి నది ఒడ్డున ఉంది.మరియు సముద్ర మట్టానికి 475 మీటర్ల ఎత్తులో ఉంది. పుట్టపర్తి యొక్క చరిత్ర శ్రీ సత్య సాయి బాబా యొక్క పుట్టుక మరియు జీవితం చుట్టూ తిరుగుతుంది. గతంలో పుట్టపర్తిని గొల్లపల్లి అని పిలిచే ఒక చిన్న వ్యవసాయ గ్రామం మరియు అక్కడ ఇళ్ళల్లో ఆవులను పెంచేవారు. సత్య సాయీ గా పిలువబడే సత్యనారాయణ రాజు నవంబర్ 23 1926 వ సంవత్సంలో శ్రీ పెద్ద వెంకప్ప మరియు శ్రీమతి ఈశ్వరమ్మ దంపతుల ఇంట జన్మించారు. తన అద్భుతమైన శక్తులు వలన ప్రజలు అతనిని షిర్డీ యొక్క సాయి బాబా అవతారముగా భావించేవారు. మరియు అతనిని సత్య సాయి బాబా అని పిలిచేవారు. అనేక సంఘటనలు కారణంగా ప్రజలు అతనిని అనుసరించడం ప్రారంభించారు, మరియు అతను ఒక ఆధ్యాత్మిక నాయకుడు అనే నమ్మకం వారికి కలిగింది. అతని బోధనలు ప్రపంచవ్యాప్తంగా జయ జయ ధ్వానాలు అందుకున్నాయి. ఆయన బోధనలు శాంతి, సత్యం, ప్రేమ, నిజాయితీ మరియు అహింస సూత్రాల పై ఆధారపడి ఉంటాయి. ఈ చిన్న గ్రామం ప్రపంచ స్థాయి పట్టణంగా మారింది.
Image source: aptdc.in
1950 లో, ప్రశాంతి నిలయం స్థాపించబడింది, మరియు ఈ ఆశ్రమం ఏర్పాటు చేయటం వలన ఈ గ్రామం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. అక్కడ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ వంటి సౌకర్యాలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు విద్యా సంస్థలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.
No comments:
Post a Comment