Friday, June 7, 2013

ఆలయ గంటలవెనుక ఎన్నో అర్థాలు….పరమార్దాలున్నాయి...

దుష్ట శక్తులను దూరంగా తరిమే ఆలయ గంటలవెనుక  ఎన్నో అర్థాలు….పరమార్దాలున్నాయి.
దేవాలయాలలో మ్రోగించే గంట సకల శుభాలకు సంకేతం. ప్రత్యెక పూజాసమాయాలలో మ్రోగించే గంట, మన మనసులను ఆధ్యాత్మికానందంతో నింపుతుంది. గంట నాలుకలో సరస్వతీదేవి కొలువై ఉంటుందనీ, గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొనభాగంలో వాసుకి ఉండటంవల్ల గంట దైవస్వరూపమని మన పెద్దల నమ్మకం.  గంటకు ఉండే పిడిలో ప్రాణశక్తి ఉంటుంది ఈ పిడిభాగం గరుడ, చక్ర, హనుమ, నంది, వృషభ మొర్తులతో దర్శనమిస్తుంటుంది. కంచుతో తయారయ్యే గంటాను మ్రోగించినపుడు ‘ఓం’ అనే ప్రణవనాదం వెలువడుతుంది. ఆ గంటానాదం మనోని చింతలన్నింటినీ పారద్రోలి, మనసును దైవం వైపుకు మరల్చుతుంది.

గంట గరుడునికి ప్రతీకగా పేర్కొంటారు. ఆలయమ్లో మ్రోగించిన గంటానాదం నలుదిక్కులా వ్యాపించి, దుష్టశక్తులను దూరంగా తరిమివేస్తుందట. తద్వారా మన మనసులు పవిత్రమై, దైవం వైపు మన మనసు లగ్నమవుతుంది. సాధారణంగా ఆలయాలలో గంటానాదం అర్చన, ఆవాహనం, దూపసేవ, దీపసేవ, అర్ఘ్యం, నైవేయం, పూర్ణాహుతి సమయాలలో మ్రోగించబడుతుంది. ఇంకా చెప్పాలంటే ఏ ఒక్క పూజ గంటానాదం లేనిదే పూర్తి కాదన్నది నిజం.

ఇత ప్రాముఖ్యత గలిగిన గంటానాదం చాలా స్పష్టంగా ఉండాలి. కర్ణకఠోరంగా కా, చెవులకు ఇంపుగా ఉండాలి. అందుకే గంటను తయారు చేసేటప్పుడు చాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. శైవాగామంలో గంట తయారికి సంబంధించిన కొలతలు కూడా చెప్పబడ్డాయి. ఐదంగుళాలు ఎత్తు ఉండే గంట నాలుగు గోధుమ గింజలంత మందంతో కూడి ఉండాలని పేర్కొనబడింది. ఇక, మహాగంట విషయంలో ఎత్తు సుమారు ఏడు అంగుళాలు వరకు ఉండాలి. క్రింది వైపున చుట్టుకొలత ఎనిమిది అంగుళాలు, పైవైపున రెండు అంగుళాలు ఉండాలి. అయితే ఈ కొలతలను ఎవరూ పట్టించుక్వడం లేదు. గంట మ్రోగుతున్నప్పుడు, శబ్దం శ్రావ్యంగా ఉండాలన్న విషయం పైనే అందరి దృష్టి నిమగ్నమవుతోంది. ఆలయ ప్రధానద్వారం దగ్గర మహాగంట ఉంటుంది. ప్రాత:కాలంలో పూజారి అలయప్రవేసం చేస్తున్నప్పుడు ఈ మహాగంట మూడుసార్లు మ్రోగించబడుతుంది. ఇది ప్రాత:కాలంలో అందరినీ మేలుకోలపడమేకాక, సమస్త దుష్ట శక్తులను దూరంగా ప్రారద్రోలుతుంది.

సాధారణంగా మహాగంటానాదం ఆలయం చుట్టుప్రక్కల ప్రదేశాలలో ౧౦ కిలోమీటర్ల విస్తీర్ణం మేర వినబడుతుంది. నైవేద్యాన్ని సమర్పిస్తున్నపుడు, మ్రోగుతున్న గంటానాదం మహామంగళహారతి వరకు కొనసాగుతుంది.

ఇంకా కొన్ని చోట్ల త్రికాలపూజల కొసమెఇ మూడు విభిన్నమైన గంటలను ఉపయోగించడం జరుగుతుంటుంది. మహాగంట నిర్మాణంలో చూస్నాపుడుచాల సాదాసీదాగా ఉంటుంది. కొండొకచో ఆకృతిలో కొన్నికొన్ని మార్పులున్దవచ్చు. కొన్ని గంటలపై పువ్వులడిజైన్లు, శ్లోకాలు ఉండవచ్చు.

పూర్వకాలంలో మహాగంటను రాజులు తమ విజయసూచికంగా బహూకరించేవారు. అయితే కర్నాటకకు చెందినా వీరశైవులు గంటకు బదులుగా గుండ్రని లోహపు రేకులను గంటానాదం కోసం ఉపయోగించడాన్ని చూడగలం. కొన్నికొన్ని దేవాలయాలో గంటతో పాటూ నగారానుకూడ వాడుతుంటారు. మేల్కొటేలోని యోగా నరసిమ్హాలయంలో టిప్పుసుల్తాన్ బహుకరించిన నగారను ఇప్పటికీ మనం చూడవచ్చు. కొన్ని కొన్ని దేవాలయాల్లో ఇనుపగంటలను గుత్తులు గుత్తులుగా తగిలించి ఉండటాన్ని మనం చూస్తుంటాం. ఈ గంటలకు అలంకరణ తప్ప ఆధ్యాత్మికంగా అంట ప్రాధాన్యత ఉండదు.

ఇక గర్భాలయంలో అర్చన చేస్తున్నప్పుడు మ్రోగించడానికి చేతిగంట ఉంటుంది. ఈ గంటలు ఆయా దైవానికి సబంధించిన చిహ్నాలతో ఉంటుంటాయి. శ్రీవైష్ణవ పద్దతిలోపూజు జరిగే ఆలయాల గంటపైన శంఖవు లేకా చక్రం ఉంటుంది. విష్ణ్వాలయాలోని గంటలపై గరుడుడు, లేక హనుమంతుని ప్రతిమలున్తై. శైవ, స్మార్త, శాక్య పూజలలో నందిరూపం పైనున్న గంటలు తమ రూపాలను వివిధ రకాలుగా మార్చుకుంతుంటాయి.

మైసూరులోని పరకాలమఠ౦లొ వేదాంత దేశికుల వారు ప్రతిమతో కూదినగాంటాను చూడగలం. ఇందు వెనుక ఓకథ ఉంది.

వేదాంత దేశికులావారి తల్లిదండ్రులకు శ్రీవేంకటేశుని పట్ల అపారమైన భక్తి. వారికి క రోజు, ఒక విచిత్రమైన కళ వచ్చింది. ఆ కలలో దేశికులవారి అమ్మగారు గర్భాలయమ్లోని గంటను మింగినట్లు కలగన్నారు. ఇద్దరు ఉలిక్కిపడి లేచి, తెల్లవారుఝామున ఆలయానికి వెళ్లిచూస్తె గంట కనబడలేదు. అనంతరం ఆమె గర్భవతియై వేదాంతదేశికులవారికి జన్మనిచ్చిందట.

అందుకే ఆ గంటపై వేదాంత దేశికులవారి ప్రతిమ!

మన హిందూధర్మంలో దేవాలయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అధ్యాత్మికాభివృద్ధికి, సర్వ మానవ సౌభ్రాతృత్వానికి దేవాలయాలు ప్రతీకలుగా గోచరిస్తున్నాయి. ఆ శ్రీరామచంద్రుడే పట్టాభిషేక నిశ్చయ సందర్భంగా సుమూహూర్తానిక్ ముందు రోజు రాత్రి అంతా నియమవ్రతుడై, దేక్షాబద్ధుడై విశ్నుదేవాలయములో ఒకరోజు రాత్రంతా ఉన్నాడు. అలాగే భారత గాథలో ధృతరాష్టుడు యువాజైన ధర్మరాజును విశ్వేశ్వర ఆలయ ఉత్సవాలలో పాల్గొనామని అడుగుతాడు. ఇక, మహాభాగవతంలో రుక్మిణీ స్వయంవరానికి ముందు, నగర పొలమేరాలోనున్న కులదేవత గౌరీదేవి ఆలయంలో ఆదిడంపతులకు ధూప దీపాడులన్, నానావిధ నైవేద్యాలను సమర్పించి, ఆలయ గంటను మ్రోగించి ఈ విధంగా ప్రార్థించింది. అలా ఆలయ గానకు నాటి రోజులలోనే చాల ప్రాముఖ్యత ఉందన్న విషయం మనకు పైన పేర్కొన్న ఘట్టాల ద్వారా అవగతమవుతోంది. రుక్మిణి గౌరీదేవిని ఇలా ప్రార్థించింది.

నమ్మితి నామనంబున సనాతనులైన యుమామహేశులన్
మిమ్ము ఋరాణదంపతుల మేలు భజింతు గదమ్మమేటి
పెద్దమ్మ దయాంబురాశినిగదమ్మ హరింబతి జేయుమమ్మ నిన్
నమ్మినవారి కెన్నడును నాశము లేదు కదమ్మయీశ్వరీ!
 Source

No comments: