Friday, June 7, 2013

చనిపోవటమంటే ఏమిటి? నేను చనిపోయిన తరువాత ఏమవుతుంది?




పుట్టుక:– 
మరణాంతరం ఏమి జరుగుతుంది? తెలుసుకునేముందు ” పుట్టుక” గురించి కొంత తెలుసుకుంటే బాగుంటుంది. ఆధునిక జీవశాస్త్రం ప్రకారం,మనిషి కోతినుండి పుట్టాడని చెప్పబడింది. అంటే, కోతి యొక్క అనేక జీవపరిణామ దశలు దాటి, అత్యున్నతమైన దశారూపమే నేటి మానవుడు అని అర్ధం. అయితే, భారతదేశ పురాణాలు, శాస్త్రాల ప్రకారం, బ్రహ్మ సృష్టి ద్వారా, మనువులు అనేవారి ద్వారా మానవులు పుట్టబడ్డారు అని తెలియబడుతున్నది. మరణాంతరము, పునర్జన్మ అనేది వున్నదని, జీవులయొక్క పాప,పుణ్యాలను బట్టి (ఇవి మనిషియొక్క మానసిక స్థితి) జీవులు తిరిగి, వారి,వారి తీవ్రమైన కోరికలనుసరించి, మానవులుగాగానీ, క్రిమికీటకాదులుగాగానీ, చెట్లు, పక్షులు, జంతువులుగాగానీ పుట్టవచ్చును. అయితే, ఈ ప్రక్రియ అంతా, “చైతన్యశక్తి”చే నడిపించబడుతూవుంటుంది. ఈ శక్తి, తనకుతానుగా, అనేక రూపాలుగా, జీవులుగా పుడుతూవుంటుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, మన ఆధ్యాత్మిక శాస్త్రంలో, భౌతిక శరీరానికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడినట్లుగా కనిఇస్తుంది. దేహంలోవున్న “దేహి” అంటే, “ఆత్మశక్తి”కి ప్రధమ స్థానం ఇవ్వబడింది. ఈ ఆత్మశక్తికి పుట్టుక, చావు అనేవిలేవు అని చెప్పబడింది. ఆధునిక విజ్ఞానశాస్త్ర ప్రకారము, శక్తిని “Energy" అని అంటారు. దీనికి శాస్త్రజ్ఞులు ఇచ్చిన నిర్వచనం " ENERGY NEITHER BE CREATED, NOR DESTROYED".

మరణం:– 
మరణానికి మరొక మారుపేరు "మార్పు". మార్పుని మనందరం చాలా సహజంగా స్వీకరిస్తాం. కానీ, మరణం అనే పదాన్ని వాడగానే, చాలా భయపడి పోతూవుంటాం. మానవునికి జీవించివున్నప్పుడు ఆరు దశలున్నాయి. వీటినే “అవస్థాషట్కము” అని అంటారు. అవి: పుట్టుట, ఉండుట, పెరుగుట, మారుట, క్షీణించుట, మరియు నశించుట. దీనినే, భగవద్గీతలో, రెండవ అధ్యాయం, సాంఖ్యయోగము, 13వ శ్లోకంలో నాలుగు అవస్థలుగా చెప్పారు: శ్లో: "దేహినోస్మిన్ యధాదేహే కౌమారం యౌవనం జరా | తథాదేహాన్తర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి |."

అర్ధం:- 
జీవికి బాల్యము, యౌవనము, వార్ధక్యము, మరియు దేహాంతరప్రాప్తి అను నాలుగు అవస్థలు కలవని. ఇవన్నియూ మార్పులే. మనిషి, బాల్యముపోయి, యౌవనము వచ్చినప్పుడు, దుఃఖించుటలేదు; యౌవనముపోయి, వార్ధక్యము వచ్చినప్పుడు దుఃఖించుటలేదు, కానీ, వార్ధక్యము పోయి, మరణం ఆసన్నమైనప్పుడు మాత్రము దుఃఖపడుతూ, బయం పొందుతూవుంటాడు. అయితే, మరణమనే మార్పు తరువాత, ” దేహాంతరప్రాప్తి ” అనగా మరొక దేహమును పొందుట అనేది ఖచ్చింతగా వున్నప్పుడు, ప్రస్తుత జన్మలో మరణం గురించి భయపడనవసరంలేదు. ఇక్కడ, ఈ విషయాన్ని రెండు కోణాల్లో పరిశీలిస్తే, చివరిగా రెండిటి లక్ష్యము, పరిణామం ఒకటిగానే కనిపిస్తుంది. మొదటి కోణం: దేహాన్ని ఆవరించియున్న ఆత్మశక్తి. ఈ శక్తికి చావు, పుట్టుకలు లేవు అన్నాంకాబట్టి, ఎప్పుడూ నిత్యంగానే వుంటున్నది కాబట్టి, మరణం గురించి భయపడనక్కరలేదు. ఇక రెండవ కోణం: మరణం, దేహానికి అని చెప్పబడింది. కానీ, దేహాంతరము, కొత్త దేహప్రాప్తి వున్నది అని చెపబడినపుడు, మరణం గురించి భయపడనక్కరలేదు. “ఉనికి” (Existence) కి అంతము (end or death) లేదు. జీవి అనే ఉనికికి కూడా అంతంలేదు. దీనికి ఉదాహరణంగా, ” చాందోగ్యోపనిషత్”, ఆరవ అధ్యాయం, రెండవ భాగంలోని, రెండవ శ్లోకంలో, ఈ విధంగా చెప్పబడింది. దీనిని, ఒకటికి, రెండుసార్లు చదివితే, మనకు బాగా అర్ధమవుతుంది:–

” The constituents of the seed have themselves subtle constituents, and of those constituents again, there are subtler constituents. Since this
process has no end, therefore, , the question of destruction can not be proved in any of these stages. Since the idea of existence persists
throughout, and since there is no cessation of existence, therefore, in the case of those who hold the view of the existence, the birth of an
existing thing from another existing thing will stand established. But in the case of those who hold the view of non-existence, no example can be
cited for illustrating the birth of an exsisting thing from non-existence. 

ఇదంతా తెలివితో ఆలోచించగలిగిన వారికి మాత్రమే వర్తిస్తుంది. లేనివారికి, మరణం ఎప్పుడూ భయంకరంగానే వుంటుంది. భగవద్గీత, రెండవ అధ్యాయం, 22,27,28వ శ్లోకాలలోకూడా దీనిగురించి వివరంగా చెప్పబడింది.

మనిషి, మనిషిపై అతిగా మమకారం, బంధాన్ని పెంచుకోవటంవల్ల, భౌతిక వస్తువులు, సుఖాలపై ప్రీతిని, మోహాన్ని, బంధాన్ని అతిగా పెంచుకోవటంవల్ల, తాను ప్రేమిస్తున్నవి, తాను అనుభవిస్తున్నవి, సుఖాన్ని ఇస్తున్నవి ఇక వుండవేమో అన్న ఆలోచనే, మరణంపై భయాన్ని కలుగచేస్తుంది. సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు మరణ భయంలేదు, కానీ, అతి సుఖాలవల్ల కలిగే అనర్ధాలు, అనారోగ్యం; ఇతరులు వాటిని తీసేసుకుంటారనే ఆందోళన మరణంపట్ల భయాన్ని కలుగచేస్తుంది. చీకటిలో ఒక త్రాడును చూసినప్పుడు,పాము అని భ్రాంతిపడి, భయపడతాం. కానీ, దానినే పగలుచూసి, అది కేవలం త్రాడుఅని తెలుసుకొని, భయాన్ని పోగుట్టుకుంటాం. అదేవిధంగా, అజ్ఞానంవల్ల, సుఖాల్ని ఇస్తున్న ఈ శరీరం మరణిస్తుంది అని భ్రాంతితో భయపడతాం. కానీ, మరణాంతరం మరొక దేహాన్ని పొందుతాము అన్న జ్ఞానం కలిగినప్పుడు, మరణభయం పోతుంది; మరణాన్ని కేవలం ఒక “మార్పు” గానే తెలుసుకుంటాం.
SOURCE : Suryapradeep

No comments: