Friday, June 14, 2013

హోగెనక్కల్ - స్మోకీ రాక్ జలపాతం

హోగేనక్కల్, ఇది కావేరి నది ప్రక్కన ఉన్న ఒక చిన్న మరియు బిజీగా వుండే గ్రామము. దీనికి ఈ పేరు రెండు కన్నడ పదాలనుండి వొచ్చింది. 'హోగె' అంటే 'పొగ' అని అర్థం మరియు 'కాల్' అంటే 'రాళ్ళు' అని అర్థం. ఈ విషయంలో పొగ ఒక ప్రముఖ జలపాతం, హోగేనక్కల్ జలపాతాలు, నుండి వొస్తుంది. నీరు పై నుంచి క్రిందికి శరవేగంతో పడుతున్నప్పుడు క్రింద భూమి పైన పొగగా మార్పు చెందుతున్నది. నదివైపు ఉన్న గ్రామం మెట్రోపాలిటన్ నగరం, బెంగళూరుకి సుమారు 150 కి. మీ. దూరంలో ఉన్నది. మరియు ఇది తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల బోర్డర్స్ మీద ఉన్నది. ఇది దేశీయ మరియు విదేశీ పర్యాటకులకు ప్రసిద్ధ వారాంతపు పర్యాటక ప్రదేశంగా ఉన్నది. కావేరి నది యొక్క గలగలలు, నదిలో పట్టుకున్న చేపలు, స్థానిక మూలికలు, ప్రత్యేక నూనెలు మరియు మర్దన పింట్లు యొక్క పురాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి మర్దనలు, ఇవి అన్నీ హోగేనక్కల్ సందర్శించి అనుభవించవలసిందే! ఎవరైతే సాహసాలను ఇష్టపడతారో, ఈ జలపాతాలలో ఈత కొట్ట వలసిందే! కాని ఇందులో ఈత కొట్టటం అంత సులభమైన పని కాదు. ఒక్క ఈత నిపుణులకు మాత్రమె సాధ్యపడుతుంది. లేదా మేలగిరి హిల్స్ గుండా ట్రెక్కింగ్ చేస్తూ, స్వచ్చమైన అడవి గాలిని ఆస్వాదిస్తూ, ఈ ప్రదేశంలో ఉన్న అద్భుతమైన ఆకుపచ్చని ప్రక్రుతి దృశ్యాలను మరియు అందాలను చూడవొచ్చు. సినిమాలు తీసేవాళ్ళు 'హోగేనక్కల్' ను రొమాంటిక్ పాటలు తీయటానికి ఎన్నుకుంటారు.


హోగేనక్కల్ ఫోటోలు, హోగేనక్కల్ జలపాతాలు
Image source: www.wikipedia.org
ఆకర్షణలు - ప్రకృతి ఒడిలో హోగేనక్కల్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి కావేరి నదిలో కోరాకిల్ పడవ రైడ్. కోరాకిల్స్, ఇవి గుండ్రంగా ఉన్న ప్రత్యేకమైన బాస్కెట్ పడవలు. వీటి అడుగుభాగం ప్లాస్టిక్ షీట్స్ తో, నీరు అడుగున చేరకుండా ఉండటానికి కప్పబడి ఉంటాయి. బోటుమాన్ తో ఒప్పందం కుదుర్చుకొండి, మరియు కావేరి నదిలో ఒక రైడ్ ఆస్వాదించండి. చూడటానికి చిన్నగా కనిపించినా, ఒక పడవలో 8 మంది పడతారు. ఇక్కడ ఆహారంతో పాటు, స్థానిక మాస్సేర్స్, వీరినే మాలిష్-కరన్స్ అని కూడా అంటారు, తో 'స్పా' చికిత్స ఇంకొక గొప్ప ఆకర్షణ. ఇక్కడి పిల్లలు నదిలోకి 30 అడుగుల ఎత్తునుండి దూకి వారియొక్క గొప్పతనాన్ని చాటుకుంటారు. పిల్లలు ఇక్కడ ఒక్క డైవ్ కి రూ.5/- తీసుకుంటుంటారు. ఈ ప్రదేశంలో మంచి అనుసంధానం మరియు మంచి వాతావరణం సంవత్సరమంతా ఉంటుంది.

No comments: