Monday, June 17, 2013

ఆత్మజ్ఞానం అందించేదే గీత :

నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.

geeta(ద్వితీయోధ్యాయం- సాంఖ్యాయోగం)

శ్లోకంః యం హి న వ్యథయం త్యేతే
పురుషం పురుషర్షభ 
సమ దుఃఖ సుఖం ధీరం
సోమృతత్వాయ కల్పతే 

హే పురుష శ్రేష్ఠా! ప్రకృతి సిద్దమైన అనుకూల, ప్రతికూల అనుభవాలు త్రోసిపుచ్చ రానివే. ఎండ, వానల వల్ల కలిగే శ్రమను సహించుట అలవాటే. అలాగే యుద్ధంలో బంధువధవల్ల కలిగే సుఖమైనా, దుఃఖమైనా తాత్కాలికమే అనే ధైర్యంతో ఎదుర్కొను సమ బుద్ధి కలవానిని మాత్రా స్పర్శలు ఏమీ చేయ లేవు. అట్టి స్వవర్ణోచిత కర్మను బాధలెదురైనా సమబుద్ధితో సహనబుద్ధితో చేయు మానవుడు మాత్రమే అమృతత్వమునందగలడు. అందుకే ఓరిమి అలవరచుకొమ్ము. అమృతత్వాన్ని సాధింపుము. 

శ్లోకంః అవినాశి తు తద్విద్ది
యేన సర్వ మిదం తతం 
వినాశ మవ్యయ స్వాస్య
న కశ్చిత్‌ కర్తు మర్హతి 
ఆత్మ నాశమునొందక నిత్యముగా ఉండుటకొక కారణమును తెలిపెదను. ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువును నశింపజేయ వలెనంటే, అందులో దూరి, దానిని నిశింపజే యవలెను. ఆత్మలు అతి సూక్ష్మములు. ఏ సూక్ష్మ పదార్థమునందైనా ప్రవేశించగలవు. కానీ ఆత్మయందు ప్రవేశించగల సూక్ష్మ పదార్ధం ఏదీ లేదు. ప్రకృతిలో అన్ని పదార్ధాల్లో ప్రవేశించగల శక్తి ఆత్మకుంది. కాబట్టి ప్రకృతి వల్ల తయారగు శరీరములన్ని నశించేవి. ఆత్మ నశించనిది. కనుకనే ఏ విష శస్త్రాదులూ ఆత్మను ఏమీ చేయలేవు.

No comments: