Friday, June 14, 2013

గ్రీన్ టీ తో బ్యూటీ బెనిఫిట్స్ అద్భుతం..ఆశ్చర్యకరం.!

 

గ్రీన్ టీ:

గ్రీన్ టీ లో చెప్పలేనన్ని బ్యూటీ బెనిఫుట్స్ ఉన్నాయి. అందుకు కారణం గ్రీన్ టీలో ఫ్లెవనాయిడ్స్, విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండటమే. ఇవి ముడతలను, నల్ల మచ్చలను, ఇంకా స్కిన్ టోన్ మరియు చర్మ సంబంధిత సమస్యలు అంటే మొటిమలు, సన్ బర్న్ మరియు స్కిన్ క్యాన్సర్ వంటివి నివారిస్తుంది . సన్ బర్న్ కు గురైన ప్రదేశంలో గ్రీన్ టీ ప్యాక్స్ ను డైరెక్ట్ గా అప్లై చేయవచ్చు. దాంతో ఆ ప్రదేశం సున్నితంగా మారడంతో పాటు తక్షణ రిలీఫ్ ను ఇస్తుంది. గ్రీన్ టీలో ఉన్న టానిక్ యాసిడ్ వాపులను మరియు మొటిమలను తగ్గిస్తుంది. గ్రీన్ టీ ఒక అద్భుతమైన డిటాక్సిఫైయర్. ఇది చర్మాన్ని శుభ్రపరచడానికి, స్వచ్చమైన చర్మ ఛాయను అంధించడానికి, హానికరమైన రసాయనాలన్నింటిని తొలగిస్తుంది. ఇంకా ఇది ముఖంలో జిడ్డును తగ్గించడానికి మరియు ఇన్ ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా చర్మం మెరిసేలా చేస్తుంది. అందుకు సులభంగా గ్రీన్ టీను త్రాగడం వల్ల కానీ లేదా గ్రీన్ టీని ప్యాక్ ల రూపంలో ముఖానికి నేరుగా అప్లై చేయడం వల్ల ద్వారా గానీ, గ్రీన్ టీ యొక్క అద్భత ప్రయోజనాలు పొందవచ్చు. మరి మెరిసే చర్మం పొందడానికి గ్రీన్ టీ ఫేస్ ప్యాక్స్ ఏంటో ఒక సారి చూద్దాం...
గ్రీన్ టీ తో అమేజింగ్ బ్యూటీ బెనిఫిట్స్...!

 1.తక్షణం మెరిపిస్తుంది: 

 

మూడు టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ మరియు మూడు స్పూన్ల కోకోపౌడర్ తీసుకొని, వీటిని ఒక చెంచా బాదం ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దీని ప్రత్యామ్నాయంగా ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ లీవ్స్ తీసుకొని వాటికి మూడు టేబుల్ స్పూన్ల మోయోనైజ్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ప్యాక్ వేసుకొన్న అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల తక్షణం చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

2.చర్మంలో చైతన్యాన్ని నింపుతుంది: 

 

 


బాగా పండిన బొప్పాయి గుజ్జు 1-2టేబుల్ స్పూన్లు తీసుకొని దానికి గ్రీన్ టీ రసాన్ని(గ్రీన్ టీ కాచగా వచ్చిన రసాన్ని)కలపాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి, తడి ముఖం మీద ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. అప్లై చేసిన 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది కమిలిన చర్మానికి అద్భుతంగా పనిచేస్తుంది. డల్ స్కిన్ తొలగించి అందమైన మెరిసే చర్మాన్ని అందిస్తుంది.

3.చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది: 

 

 

 

 ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండికి, రెండు టీ బ్యాగ్ ల గ్రీన్ టీని మిక్స్ చేసి, దానికి ఒక స్పూన్ నిమ్మరసాన్ని కూడా మిక్స్ చేసి బాగా పేస్ట్ లా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. బియ్యం పిండి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది మరియు చర్మాన్ని స్వచ్చంగా మార్చుతుంది. దాంతో వెంటనే మీ చర్మం ప్రకావశవంతంగా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది.
  
నీటిని బాగా కాచీ అందులో మూడు టీ బ్యాగ్స్ ను డిప్ చేయాలి. మరియు అందులో అల్లం ను కొద్దిగా వేయాలి. ఈ రెండు బాగా కాగిన తర్వతా వచ్చే రసాన్ని మొటిమలు మరియు మచ్చలు, కాంతి తక్కువగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇంకా మీరు ఈ మిశ్రమానికి ఎగ్ వైట్ ను కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల చర్మాన్ని స్పష్టమైన మరియు కళంకం లేని చర్మ సౌందర్యాన్ని ఇస్తుంది. ఈ మిశ్రమాన్ని ఓల్డ్ స్కార్స్ తొలగించడానికి కూడా బాగా సహాయపడుతుంది.

4.ముడుతలు మాయం: 

 


ఈ ఫేస్ ప్యాక్స్ ముడుతలను మరియు వృద్ధాప్య ఛాయలను తొలగించడానికి సహాయపడుతుంది. 3స్ట్రాబెర్రీలను తీసుకొని, వాటిని మెత్తగా చిదిమి, అందులో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ మరియు తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి వృత్తాకారంలో మర్దనా చేయాలి. 20నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చూడటానికి యంగ్ కనిపించే చర్మాన్ని బహిర్గతం చేస్తుంది.

5.రేడియంట్ స్కిన్: 

 

 



ఒక టీస్పూన్ తేనె మరియు ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ మరియు ఒక టీస్పూన్ గ్రీన్ టీ పౌడర్ మూడింటిని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా కాచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి మసాజ్ చేసి అరగంట అలాగే వదిలేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ చర్మం ప్రకాశవంతంగా మరియు ఆశ్చర్యకరమైన లుక్ ను కలిగి ఉంటుంది.
ముగింపు: గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మంలో చైతన్యం నింపుతుంది మరియు మీరు ఎప్పటీకీ యవ్వనంగా మరింత ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. మరి మీరు ఇలా కాంతివంతమైన క్లియర్ స్కిన్ పొందడానికి సిద్దంకండి...

No comments: