రూపాయి పతనం.. సామాన్య మానవునిపై భారం ఎలా..?
1. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల
భారత్ దిగుమతుల బిల్లు ప్రతి సంవత్సరం 450 బిలియన్ డాలర్ల పైమాటే.
రూపాయి క్షీణంచడం వల్ల ఈ బిల్లూ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే.. పెట్రోల్
రేటు లీటరుకు రూ. 2 మేర పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో పెరిగే
అవకాశముందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.
2. కీలకమైన ఉత్పత్తులు, ఎరువులు మరింత భారం
కీలకమైన ఉత్పత్తులు, ముడి సరుకులు కోసం భారత్ ఎక్కువగా దిగుమతులపైనే
ఆధారపడాల్సి వస్తోంది. ముడి చమురు, బంగారం, ఎరువులు మొదలైన వాటన్నింటినీ
దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇందులో అత్యధిక వాటా ముడిచమురుదే. ఫలితంగా
వంట నూనెల నుంచి పెట్రోల్ దాకా అన్నీ భారం అవుతాయి.
3. విదేశీ రుణాలు మరింత భారం
రూపాయి పతనంతో అత్యధికంగా విద్యుత్, సిమెంట్, టెలికం రంగ కంపెనీలపై
ప్రతికూల ప్రభావం పడనుంది. కొనాళ్ల క్రితం విదేశీ రుణాలు చాలా చౌకగా
దొరుకుతుండటంతో చాలా దేశీ కంపెనీలు చక చకా అప్పులు తెచ్చుకున్నాయి. ఇప్పుడు
రూపాయి క్షీణంచండం వల్ల కట్టాల్సిన వడ్డీ పెరగడమే కాకుండా అసలు మొత్తం
కూడా పెరిగిపోయింధి.
4. రూపాయి పతనం.. బంగారం ఎఫెక్ట్
అంతర్జాతీయంగా పసిడి తగ్గుతున్నా.. రూపాయి పతనం వల్ల దేశీయంగా ఆ
స్థాయిలో తగ్గడం లేదు. గడిచిన పక్షం రోజుల్లో అంతర్జాతీయంగా బంగారం ధరలు
2.94 శాతం దాకా పడగా.. దేశీయంగా మాత్రం 3.14 శాతం పెరిగాయి.
No comments:
Post a Comment