లంచం పై పోరాటo.....
1.
సమాజంలో ఏ మాత్రం మనకి నచ్చని పద్దతులుక నిపించినా వ్యవస్థ అంత
కుళ్ళిపోయింది, అంటూ పక్కనుంచి తప్పుకుని వెళ్ళిపోతాం. అయితే - మార్పు
సాధ్యమేనని నమ్మేవారు కొంతమంది వుంటారు. అందుకు ప్రయత్నిస్తారు . మిగతా
వారిని ఆలోచించమంటారు , ఇటువంటి వ్యక్తులు ఈ కాలంలో తక్కువగా కనిపించినా
అరుదైతే కాదు - అందులో ఒకరు విజయ్ -అమెరికాలో మంచి ఉద్యోగం,ఆస్తి సంపాదన
అన్నిటిని వదిలి ఓ సంకల్పంతో మాతృభూమిపై అడుగు పెట్ట్టాడు. అతను
అనుకున్నది సాధించేందుకు ప్రయత్నాలు మొదుపెట్టి నెమ్మది నెమ్మదిగా
ప్రజల్లో అవగాహనా కల్పించేందుకు ప్రయత్నించి ఈ రోజున ఓ గొప్ప మార్పుకి
మూలమైయ్యడు.. ఒక్కరుగా ఎంత సాధించవచ్చో నిరూపించాడు
2. లంచం
అన్ని స్థాయిల్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. దాని ఇనుప పాదాల
కింద నలిగి ఎందరో విలవిల్లాడుతున్నారు.. ఎన్ని చట్టాలు వున్నా చేయి చాపే
వారు చాపుతూనే వున్నారు , ఇదిగో ఈ లంచం పైనే గురిపెట్టాడు విజయ్ - ఎక్కడో
అమెరికాలో వున్న తనని అక్కడ స్నేహితుల మాటలు, హేళనలు, లంచం పై పోరాటానికి
సిద్దపడేలా చేసాయి. అవినీతికి వ్యతిరేకంగా ప్రజా చైతన్యమే
పరిష్కారమనుకుని 'ఫిఫ్త్ పిల్లర్" అనే సంస్థ ను తమిళనాడులో ప్రారంభించాడు
. శాసనం ,చట్టం, న్యాయం, మీడియా సమాజానికి నాలుగు స్తంభాలయితే ప్రజల ఐదో
స్తంభం అనే నినాదంతో ప్రారంభమయింది .ఈ "ఫిఫ్త్ పిల్లర్ "అవినీతిపై
సందించిన అస్త్రం ఏంటో తెలుసా , ' జీరోనోట్ '.
౩. ఈ " జీరోనోట్ " ఇప్పుడు సమాజంలో విప్లవాత్మక మార్పులకి నాంది పలికింది. రూపాయి నోట్లలా వుండే ఓ జీరోనోట్ ని సృష్టించాడు రూపాయి విలువ తో చూస్తే దానికి ఏ విలువా లేకపోయినా , లంచానికి మేం వ్యతిరేకం అనితెలపడమే దాని ప్రధాన ఉద్దేశం. అంటే మనల్ని ఎవరైనా లంచం అడిగితే వారికి ఆ జీరోనోట్ ఇవ్వాలని, అంతేకాదు దాంతో మనం లంచానికి వ్యతిరేకమని తెల్సిపోతుంది.. ఆ నోటుపై లంచం తీసుకోవడం ,అడగటం, ఇవ్వడం నేరమనే సందేశం వుంటుంది - దాంతో మనకి నిబంధనలు తెల్సునని ఎదుటి వ్యక్తికీ అర్ధమైపోతుంది, మరి ఇలా " జీరోనోట్ "ని ఇచ్చినా లొంగని లంచావతరాలు సంగతేంటి అంటారా ? దానికి ఓ మార్గం వుంది.
4. జీరోనోట్ అంటేనే లంచానికి వ్యతిరేకం అని చెప్పటం, అయితే ఇలా "జీరోనోట్" ఇచ్చిన ఇంకా లంచం కోసం వెధిస్తే "ఫిఫ్త్ పిల్లర్ " కార్యకర్తలు అటువంటి వారిపై ఫిర్యాదులు చేస్తారు అవసరమైతే స్పింగ్ ఆపరేషన్లునిర్వహించి వారి పని పడతారు . ఇలా "జీరోనోట్" ని ఉపయోగించి ఇప్పటి వరకు ఎందరో లంచం ఇవ్వకుండా పనులు చేయించుకోగలిగారు , అంతే కాదు దేశంలో ఏ మూలా వున్నవారైన సరే " ఫిఫ్త్ పిల్లర్" ల్ సభ్యులిగా చేరే అవకాశం, అలాగే ఫిఫ్త్ పిల్లర్ సహాయం పొందే అవకాశం కూడా వుంది ఇందుకోసం ఈ జీరోనోట్ పై అవగాహనా కల్పించేందుకు విజయ్ అతని బృందం విస్తృతంగా పర్యటిస్తున్నారు కూడా.
5. ఇప్పటికే దాదాపు ఐదు లక్షల నోట్లు వాడబడ్డాయంటే అర్ధం చేసుకోండి ఎంత మంది అవినీతికి ఈ జీరోనోట్ చెక్ పెట్టిందో - కేవలం లంచం ఇవ్వడం ఇష్టం లేనివారే కాదు తీసుకోవడం ఇష్టంలేని నిజాయితీపరులు కూడాఈ నోట్ ని తమ సీట్ దగ్గర అతికించుకుంటే చాలు, అతని దగ్గరికి వచ్చేవారికి అతను లంచానికి వ్యతిరేకి అని, ఫిఫ్త్ పిల్లర్ సభ్యుడని ఇట్టే అర్ధమైపోతుంది .దాంతో లంచం ఇవ్వటానికి సాహసించారు . ఇలా ఒక్కొక్కరుగా చేయి కలిపితే ఎంతటి మార్పు అయిన సాధ్యమే అని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫిఫ్త్ పిల్లర్ సభ్యులు.
www.5th pillar.org
No comments:
Post a Comment